19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మా గురించి

యావత్ ప్రపంచంలో విస్తరించి ఉన్న "తెలుగు" ప్రజలకు, తమ "తెలుగుజాతి" అస్తిత్వం నిలబెట్టుకోవాలనే కోరిక సహజంగానే ఉంటుంది. నిజానికి ఏ జాతి, మత, దేశ, భాష, సంస్కృతులకు చెందిన మనుష్యులైనా , ఆయా వర్గవిశిష్ఠతలనూ, తమ ప్రత్యేక లక్షణాలనూ పరిరక్షించుకోవాలనీ, తమ "మూలం" ఇది అన్న ఒక సంఘీభావాన్ని ప్రకటించుకోవాలనీ ఆశించటం అనేది, మానవ మనుగడలోనే అంతర్లీనమైన ఓ లక్షణం.

మరి తెలుగువారి అస్తిత్వానికి ప్రథమ చిహ్నం "తెలుగు" భాషే కదా!. అందుకే ప్రపంచంలోని సమస్త విషయ పరిజ్ఞానానికి భాండాగారమై ఎదుగుతున్న ఇంటర్ నెట్ లో, తెలుగువారందరూ ఆయా విషయాలను తమ మాతృభాషలోనే చదువుకొని, వినోదాత్మక విషయాలతో ఆనందించి , విమర్శనాత్మక విషయాలను చర్చించి, విజ్ఞానాన్ని పెంచుకునే మార్గంలోనే "తెలుగు వాడుక " నీ పెంచుకొని, తెలుగు ప్రజలందరూ ఏకమై ఎదగాలన్న ఒక దృక్పదంతో " apallround.com" ఆవిర్భవించింది.

ఇది నేటి భౌగోళిక " ఆంధ్రప్రదేశ్" ను మాత్రమే ప్రతిబింబిచే క్షేత్రమనుకుంటే పొరపాటే. భౌగోళికంగా, భారతదేశంలో "భాషాప్రయుక్త రాష్ట్రాం"గా ఏర్పడ్డ "ఆంధ్రప్రదేశ్" లాగానే , ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగువారు, ఈ ప్రదేశంలో తెలుగులో మాట్లాడుకుంటూ, చదువుకుంటూ, రాసుకుంటూ , "తెలుగు" లభివృద్ధి చెందాలన్న ఆశయంతో, ఆకాంక్షతో , ఈ చోటుని నిర్మిస్తున్నాం. "ఎపిఎ" (apallround.com) అనేది ఇంటర్ నెట్ కి తెలుగు పదంగా మారేంతగా, అన్ని విషయాలను తెలుగులో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం.

భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్న భారతదేశం చరిత్రలో ఏనాడు ఒక్క దేశం కాదు. కానీ "భిన్నత్వంలోని ఏకత్వం” దర్శించిన ఎందరో మహానుభావులు ఈ దేశాన్ని తీర్చిదిద్దారు. అయినప్పటికీ , ఎన్నో రాజకీయ, సాంఘిక, చారిత్రక కారణాలరీత్యా, దేశంలో ’వేర్పాటువాదం’ పలురూపాల్లో విరాజిల్లుతునే ఉంది. "ప్రాంతీయతత్వం" , "వెనుకబాటుతనం" , "రాజకీయం" - ఏ కారణమైనా కావచ్చు - కానీ అదీ ఒక మానవ సంఘటిత పోరట మనుగడ శైలిగానే పరిగణించాలి. అసలు సిసలైన ’తెలుగు’ తెలంగాణం అనేది ఒకానొక చారిత్రక దృక్పదం. ఆ ప్రాంతం నుంచి విస్తరించి, వలసచెందిన కారణంగా, "ఆంధ్రప్రదేశ్" నిండా "తెలుగు" విస్తరించిందన్నట్టుగా, ప్రపంచంలో విస్తరించిన తెలుగువారి "ఇంటర్ నెట్" చిత్రపటమే ఈ " ఎపిఎ" (apallround.com)

అయినా భారతదేశంలోనే కాదు, భారత ఉపఖండంలోని ప్రజల జీవనశైలి లోని సారూప్యాలూ తగ్గ లేదు. "ప్రపంచీకరణ" నేపథ్యంలో అన్ని దేశాల మధ్య సామీప్యత మరింత పెరుగుతోంది. అల్రెడీ ఇంగ్లీషు యూనివర్సల్ లాంగ్వేజి అని అందరికి తెలిసిపొయినా, మరి జనం వారి వారి లోకల్ లాంగ్వేజిలలో సినిమాలు చూడటం లేదా!. టివి సీరియల్స్ చూడటం లేదా ! రాయడం చదవటం కాస్తా తగ్గిందికానీ , మన ప్రస్తుత పరిస్థితులను అద్దం పట్టే కళారూపాలుగా ఇవి బాగానే చెలామణి అవుతున్నాయి. మారుతున్న సాంఘిక స్థితిగతులననుసరించి, మారుతున్న తెలుగు భాషను కలుషితమనకుండా, తెలుగు భాషాభివృద్ధికై ఇతర భాషా పదాలను స్వీకరిస్తూ , సరళ తెలుగు భాషలో కూడా నేటి ప్రపంచాన్ని చర్చించడం , తద్వారా "తెలుగు వాడుక" ను పెంచడం మా అభిమతం. ముఖ్యంగా తెలుగు లోకం లోకాన్నంతా "తెలుగు" లోనే తెలుసుకోవాలన్నదీ, అది ఒక్కటే "తెలుగుభాష" ను నిలిపి, తెలుగు మనిషిని ఉన్నతస్థాయిలో ఉంచగలుగుతుంది అని మా అభిప్రాయం.నమ్మకం.

సంప్రదించండి / Contact

editor@apallround.com

info@apallround.com


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved