19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీ వికృతి నామ సంవత్సరం - పంచాంగం

పంచాంగం 2010-2009

(పఞ్చాఙ్గమ్ అని రాయాలి.. కానీ...మనం మారిపోయాంకదా...అందుకని "పంచాంగం" కూడా మారింది! ... ఇక ముందుకు..)

వివిధ కొలమానాల(క్యాలెండర్స్)లోఈ సంవత్సరం:

  • కలి ఆదిగా ఈ సంవత్సరం: 5111
  • ఫసలీ సంవత్సరం: 1418-19
  • క్రీస్తు శకం: 2010-11
  • శాలివాహన శకం: 1932
  • హిజరీ సంవత్సరం: 1431-32
  • భారత స్వాతంత్ర్య శకం: 63-64

శ్రీ వికృతి నామ సంవత్సర ఫలమ్

శ్లో|| ప్రకృతిర్వికృతిం యాతి భీమ సంగ్రామ భూమిషు

తదాది సుఖినో లోకాశ్చాస్మిన్ వికృతి వత్సరే ||

వికృతి నామ సంవత్సరమున వర్షములు విశేషముగా అనగా బాగా ఎక్కువగా ఉండును. వరాహ సంహితలో ఈ సంవత్సరమున భయప్రదముగా యుండునని చెప్పబడెను. ఈ వికృతి నామ సంవత్సరమున యుద్ధ భయములు కలిగి యుండి ప్రకృతి వికృతిని పొందును. అయిననూ ప్రజలందరూ సుఖసంతోషములతో నుండగలరు. ఈ వికృతి నామ సంవత్సరమున 'ధాన్యములు' దానంచేసిన మహాఫలము.

బార్హస్పత్యేన శ్రీ శోభకృన్నామ సంవత్సర ఫలమ్

శ్లో|| శోభకృద్వత్సరే సర్వసస్యానామభివృద్ధయః

నృపాణాం స్నేహ మన్యోన్యం ప్రజానాం చ పరస్పరం ||

భాద్రపదాబ్ద ఫలమ్

శ్లో|| అబ్దే భాద్రపదే వృష్టిః క్షేమారోగ్యే క్వచిత్ క్వచిత్

పూర్వ సస్య సమృద్ధి సాస్యాన్నాశం యాత్యపరం ఫలమ్ ||

బార్హస్పత్యమానము ననుసరించి ఈ శోభకృన్నామ సంవత్సరమున సర్వ సస్యములు సమృద్ధిగా ఫలించును. పాలకులు,ప్రజలు పరస్పరము స్నేహ భావముతో నుండగలరు. భాద్రపదాబ్దమున వర్షములు, సుఖసంతోషములు,ఆరోగ్యము మధ్యమముగా నుండును.అనగా సరాసరిగా నుండును.మొదటి పంట (సస్యములు) సమృద్ధిగా ఫలించును.రెండవ పంటకు హాని కల్గును.

ఈ సంవత్సరమున రాజు - సేనాధిపతి, అర్ఘాధిపతి - మేఘాధిపతి (మొత్తం నాలుగు ఆధిపత్యాలు) గా కుజుడు. మంత్రి - బుధుడు. సస్యాధిపతి - నీరసాధిపతి గా శుక్రుడు. ధాన్యాధిపతి - గురుడు. రసాధిపతి - రవి. పురోహితుడు - శని. ఈవిధముగా నవ(9) నాయకులలో నాలుగు(4) ఆధిపత్యములు; మొత్తంగా ముప్పది (30) ఆధిపత్యములలో పది (10) ఆధిపత్యములు శుభులకు వచ్చినవి.

సర్వసస్య సముదాయమగు పదునారు (16) వీసములందు ఏడు (7) వీసముల పంట ఫలించును.

పశుపాలకుడు,పశువులను దొడ్డిపెట్టువాడు, దొడ్డినుండి విడిపించువాడు - యముడు. ఈ మూడు (3) ఆధిపత్యములు యమునికి వచ్చుటచేత స్వల్పమైన వృష్టి గోచరించి,పశువులు పీడలకు గురి కాబడుతూ, వస్తు లభ్యతలు దుర్లభముగా వుండును.

ఈ సంవత్సరమున రెండు(2) కుంచముల వర్షము మధ్యమ వృష్టి నిచ్చును. అందు పది(10) భాగములు సముద్రము నందును, ఏడు(7) భాగములు పర్వతముల మీద, రెండు(2) భాగములు భూమిపైననూ వర్షించును.

ఈ సంవత్సరమున వైశాఖము అధికమాసము. ఈ సంవత్సరంలో మన ప్రాంతంలో గోచరించు (కనబడే) గ్రహణములు లేవు. గత(విరోధి) సంIIన ఏర్పడిన గురు మౌఢ్యము ఈ సంవత్సరం చైత్ర శుద్ధ చవితి (19-03-2010) శుక్రవారము వరకు వుండును. ఈ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ ద్వాదశీ, మంగళవారం (19-10-2010) నుండి బహుళ(కృష్ణ) ఏకాదశీ, మంగళవారం (02-11-2010) వరకు శుక్రమౌఢ్య ముండును.

ఈ సంవత్సరం ఫాల్గుణ బహుళ (కృష్ణ) పంచమీ, గురువారం (24-03-2011) నుండి గురుమౌఢ్యము ప్రారంభ మగును.

ఈ సంవత్సరం మార్గశిర శుద్ధ పాడ్యమి, సోమవారం (06-12-2010) న ప్రణితా నదీ పుష్కరములు ప్రారంభమగును.

సర్వేషాం సమస్త సన్మంగళాని భవన్తు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved