19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీ వికృతి నామ సంవత్సరం - పంచాంగం

నవ నాయకులు - ఉపనాయకులు - ఫలము

1.రాజు ......................కుజుడు

వాయువుతో కూడిన అగ్నిగ్రామములను,పట్టణములను, వనములను దహింపజేయును. మేఘములు సామాన్యంగా వర్షించును. వస్తు సౌలభ్యములుండవు. రాజులకు యుద్ధ భయము కలుగును.

2.మంత్రి ......................బుధుడు

అగుటచే మేఘములు గాలిచేత ఎగరగొట్టబడును. మానవులు పాపకర్మలందు ఆసక్తులు కలవారగుదురు. ప్రజలు మధ్యమ ఫలమును పొందకలరు.

3.సేనాధిపతి ......................కుజుడు

అనేకములైన క్రిమికీటకాదులచే సస్యనాశములు ఏర్పడును. లోకమందు అగ్ని భయములుండును. పాలకులు పరస్పరము యుద్ధములు కలిగి యుందురు.

4.సస్యాధిపతి ......................శుక్రుడు

మెట్టభూములు పచ్చని పంటలు బాగుగా ఫలించును. ప్రజలందరు ఆరోగ్యముగా నుండి మంచి వర్షములను పొందగలరు.

5.ధాన్యాధిపతి ......................గురుడు

అన్నిదేశములు మంచి వర్షములతో బాగుండి సమస్త ధాన్య జాతులతో వృద్ధికరముగా ఉండును.

6.అర్ఘాధిపతి ......................కుజుడు

7.మేఘాధిపతి ......................కుజుడు

వర్షములు స్వల్పముగా ఉండి వాయువుతో కూడి ఉండును. అచ్చటచ్చట వర్షములు కురియును. పంటలు, ఆరోగ్యములు సామాన్యముగా ఉండును.

8.రసాధిపతి ......................రవి(సూర్యుడు)

రస వస్తువులు స్వల్పముగా లభించును. ప్రజలందరు అధర్మ కార్యములందు ఆసక్తి కలవారగుదురు. రాజులు అన్యోన్యము వైరభావమును కలిగి ఉండగలరు.

9.నీరసాధిపతి ......................శుక్రుడు

కర్పూరము, అగరు, మంచి గంధము, బంగారము, ముత్యములు, వస్త్రములకు అధికమైన ధరలుండగలవు.

10.పురోహితుడు ......................శని

పురోహితాదులు క్రూరులైన, క్రూర ఫలమును--శుభులైన శుభ ఫలములు యిత్తురు.ఉపనాయకులు (పురోహితాదులు).

11.పరీక్షకుడు...................గురుడు.

12.గణకుడు.......................రవి.

13.గ్రామ పాలకుడు............కుజుడు.

14.దైవజ్ఞుడు....................కుజుడు.

15.రాష్ట్రాధిపతి..................కుజుడు.

16.సర్వదేశోద్యోగపతి........బుధుడు.

17.అశ్వాధిపతి...................బుధుడు.

18.గజాధిపతి........................శని.

19.పశూనామాధిపతి...........కుజుడు.

20.దేశాధిపతి......................శుక్రుడు.

21.నరాధిపతి......................కుజుడు.

22.గ్రామపాలకుడు..............గురుడు.

23.వస్త్రాధిపతి.......................రవి.

24.రత్నాధిపతి...................కుజుడు.

25.వృక్షాధిపతి.....................గురుడు.

26.జంగమాధిపతి.................కుజుడు.

27.సర్పాధిపతి......................రవి.

28.మృగాధిపతి.....................కుజుడు.

29.శుభాధిపతి........................కుజుడు.

30.స్త్రీణామాధిపతి...................కుజుడు.సావన వర్షాధిపతి ......................శుక్రుడు

ఫలము: జలధాన్యములు , మెట్టధాన్యములు అన్నిరకముల భూముల యందు మంచి పంటలు పండును.పశుపాలకుడు, పశువులను దొడ్డిపెట్టువాడు, దొడ్డినుంచి విడిపించువాడు ......................యముడు.

ఈ మూడు ఆధిపత్యములు యముడి కి వచ్చుటచే స్వల్ప వర్షములు కురియగలవు. వస్తువుల లభ్యత తక్కువుగా ఉండును. పశువులు పీడలకు గురికాబడును.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved