17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రియల్ రంగంలోపారదర్శకతకై

రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు తీసుకువచ్చే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.మన దేశంలో స్థిరాస్తి రంగాన్ని నియంత్రించటానికి ఇప్పటివరకూ ఎలాంటి వ్యవస్థా లేదు. నియంత్రణా వ్యవస్థను కల్పించడం ద్వారా రియలెస్టేట్ రంగంతో సంబంధం ఉన్న సంస్థలతో బాటు ప్రభుత్వ సంస్థల్లో కూడా జవాబుదారితనం పెరగుతుంది.

పాత నిబంధనలు

అభివృద్ధి చెందిన దేశాల్లో చట్టాలెంత పక్కాగా ఉండటంతోరియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(REIT), ఫండ్ల ద్వారా నిధుల అధికమొత్తంలో అందుబాటులో ఉంటాయి. అలాగే పోటీ కూడా అదే విధంగా ఉంటుంది. నిర్మాణ రంగానికి పనికిరాని చట్టాలను ఎప్పటికప్పుడు మార్పులుచేర్పులు చేస్తుంటారు. దీంతో స్థిరాస్తి రంగంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. మన వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులకు పనికిరాని పాత నిబంధనలను ఎన్నో పేరుకుపోయాయి. వాటిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త నిబంధనలు అమలు చేసినపుడు మన దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో కూడావిదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు "రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(REIT)", ఫండ్ల ద్వారా నిధుల పెట్టగలుగుతారు.

బ్యూరోక్రసీలో మార్పు

ప్రభుత్వ శాఖల వల్ల ఎదురయ్యే సమస్యలను నిరోధించటానికి చర్యలు చేపట్టాలని పలు నిర్మాణ సంస్థలు గట్టిగా కోరుతున్నాయి. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, సులువుగా అనుమతులిచ్చే విధంగా నిబంధనలను సరళం చేయాలని, సమయం వృథాను గణనీయంగా తగ్గించాలని వారు కోరుతున్నారు. అనుమతుల్లో పారదర్శకత ఏర్పడటానికి సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకురావాలనే వాదనలూ విన్పిస్తున్నాయి.

ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ బిల్లు అమల్లోకి వస్తే కొనుగోలుదారుల కష్టాలు తగ్గుతాయి.

ముఖ్యాంశాలు

  • అమ్మకాల్లో పారదర్శకత పెరుగుతుంది.
  • ప్రమోటర్లు, మధ్యవర్తులు, కంట్రాక్టర్లు తప్పనిసరిగా తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అడ్డగోలుగా బోర్డు ఇప్పేసే వ్యాపారస్తుల సంఖ్య తగ్గుతుంది. వీరిపై చట్టపరమైన చర్యలూ తీసుకుంటారు.
  • నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసే నిర్మాణాలకు అనుమతిని రద్దు చేస్తారు.
  • కార్పెట్‌ ఏరియా లెక్కన ఇళ్ళ క్రయ విక్రయాలు జరుగుతాయి

రియల్ ఎస్టేట్ - హైదరాబాద్ - మంచి కాలం మళ్ళీ వస్తోంది

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved