17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

హిలరీ క్లింటన్‌ను ఎవరు మొడతారు!

By వేదాంతం, శ్రీపతి శర్మ

ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పర్యావరణానికి సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయ దలచినట్లు ఐక్యరాజ్య సమితిసెక్రటరీజనరల్ గారు సెలవిచ్చారు. బాగుంది! అయితే, దానితో పాటుగా ఒక చిత్రమైన మాట అన్నారు. ఈ సమావేశంలో అందరి కంటే ఎక్కువగా ప్రపంచ పర్యావరణాన్ని బాధిస్తున్న చైనా, భారత దేశాలు ముఖ్యంగా పాల్గొనాలనీ, అలాగే కొత్త అమెరికా అధ్యక్షులు ఒబామా గారు వస్తే చాలా బాగుంటుందీ అని అన్నారు; ఈ మాటకు బ్రిటన్ ప్రధాని కూడా వత్తాసు పలికారు. వైట్ హౌస్ నుంచి ఎటువంటి నిర్ణయం రాకపోయే సరికి, సెక్రటరీగారు 'ఒబామావారు రాకపోతే సమావేశం చేయటం అంత బాగుండదు' అని అన్నారు; గోర్డన్మహాశయులు మరల తందానా అన్నారు!

విషయం లోకి వద్దాం.

అత్యధికంగాకార్బన్-డై-ఆక్సైడ్‌ను వదులుతున్న ఇరవై దేశాల పేర్లనుఓక్రిడ్జ్ నేషనల్ రిసర్చ్ లేబొరేటరీ వెళ్లడించింది. అందులో ముందుగా ఉన్నది అమెరికా! (1,650,020 టన్నులు- 5.61 పర్ కాపిటా). తరువాత చైనా (1,366,554 టన్నులు -1.05 పర్ కాపిటా), తరువాత రష్యా ( 415,951 -2.89 పర్ కాపిటా). ఆ తరువాత మన దేశం ( 366,301 -పర్ కాపిటా 0.34)

వీరి అభిమతం ప్రకారం అభివృధ్ధి చెందిన దేశాలేఅందరి కంటే ఎక్కువ కార్బన్-డై-ఆక్సైడ్ బయటికి వదులుతున్నాయి. అయితే, అభివృధ్ధి చెందుతున్న దేశాలలో దీనిపెరుగుదలరేటు ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

ఇప్పుడు ఆర్థిక ఎదుగుదలకు గల సమస్యలను, అసలు కాలుష్యం సంఖ్యలను చూసి ఇలాసెక్రెటరీ జనరల్‌గారు వ్యాఖ్యానించటం ఉచితమేనా? అమెరికా ముక్కు వంకర అంతగా పెట్టుకుని ఈ రెండు దేశాలనే గుర్తించి, పైగా అమెరికా హీరో గారు వస్తే దేశాల మీద సమావేశం ప్రభావం బాగుంటుందని చెప్పి, రాకపోతే అసలు సమావేశమే జరగక పోవచ్చని సెలవివ్వటం న్యాయమా? అడిగే వాడు లేడు. అంతేనా?

ఇంకో మాట! అమెరికాలో పవర్ ప్లాంట్ల నుంచి వస్తున్న వివిధ రసాయనిక గ్యాసులు, ఆ దేశంలోని 40% జనాభాని ఆస్పత్రులలోకి చేరుస్తున్నాయట. అలా అనిఅమెరికాలోని పబ్లిక్ ఇంటరెస్ట్ రిసర్చ్ గ్రూప్ - ఎడ్యుకేషన్ ఫండ్ వారు ఆ ప్రభుత్వానికి సూచించారు. ఆ దేశం లోని 40 రాష్ట్రాలలో పరిస్థితి తీవ్రంగా ఉన్నదని చెప్పారు. దీనిని డర్టీ పవర్ అని కూడా వర్ణించారు.

పోనీ ఇవన్నీ ప్రక్కన పెట్టి, హిందూ మహాసముద్రంలోకి వస్తున్న అణు సంబంధమైన వ్యర్ధం, ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగాఅంతరిక్షంలోకి పంపుతున్న ఉపగ్రహాలూ అంతరిక్షనౌకల చెత్త,ఫిలిపీన్స్,పనామా లాంటి దేశాలలో నెలకొల్పినన్యూక్లియర్ బేసులు - ఇవన్నీ ఎక్కడ చర్చిస్తారు సార్? ఎవరు చర్చిస్తారు?

ఇరాక్ అఫ్గానిస్తాన్‌లలో ఆడుకున్న ఈ అమెరికా, అక్కడ ఎటువంటి కాలుష్యం సృష్టించిందో అక్కడ గాలి పీలుస్తున్న వారిని అడగాలి… అన్నీ నేనేనని చొక్కా చించుకోవటం, అలా చించుకున్న వాడి వెనుక "యెస్ బాస్!" అని ఐక్యరాజ్య సమితి నిలబడటం, నిజాన్ని నిలదీయవలసిన సమయం వచ్చినప్పుడు అమెరికా తన్ను కాకుండా లెక్క వేసుకోమనటం మనకి మామూలే!

మన దేశంలో పర్యటన సందర్భంగా హిలరీ క్లింటన్ క్లైమేట్ ఛేంజ్-వాతావరణంలో మార్పు గురించి మాట్లాడారు. అందరూ కార్బన్ కాలుష్యం విషయంలో భారత దేశం కొన్ని నియమాలు పాటించాలని కోరుకుంటున్నారుట. ఇది మన దేశానికే మంచిదట.

ఈ విషయంలో జయరాం రమేశ్ గారి వ్యాఖ్య చాలా బాగుంది. అంతకంటే ఎక్కువ ఆ వ్యాఖ్యను కరపత్రాలుగా అక్కడ ఉన్న పాత్రికేయులకు పంచటం ఇంకా బాగుంది. ఆయన 'మాది అందరికంటే తక్కువగా ఉన్న కార్బన్ ఎమిషన్. ఇవి తగ్గించాలని మా మీద ఒత్తిడి తేవలసిన అవసరం లేదు' అని తేల్చి చెప్పారు.చాలా కాలం తరువాత ఇంత సూటిగా సమాధానం ఇచ్చిన మంత్రిగారు కనిపించారు.

ఆమె భారతీయ కార్బన్ ఎమిషన్స్ గణనీయంగా పెరుగుతున్నాయి, పర్ కేపిటా సంగతి పక్కన పెట్టండీ అన్నది. హిలరీ గారూ!ఒక్కసారి పైన పేర్కొన్న మీ దేశంలోని పరిశోధనా సంస్థ ఇచ్చిన వివరాలనుచూసుకుని ఇతర దేశాల గురించి మాట్లాడండి. రోజులు మారుతున్నాయి. పావుకిలో చాలిన చోట మూడు కిలోలు కొనిపారేసే దేశం మీది. ఒక పౌండు బీఫ్ తయారు చేయటానికి 2500 గేలన్ల నీరు అవసరం అవుతుంది. జీవన శైలి గురించి ఒక్క సారి ఈ దేశాలు ఆలోచించాల్సి ఉంది.

మీ మాజీ అధ్యక్షుడు భారతీయులను తిండిపోతులని కూడా ఇలానే అన్నాడు!

భారత దేశం కాలుష్యం విషయంలో ప్రపంచంలో ప్రముఖ పాత్ర పోషించాలని వారు చెప్పటం కూడా బాగుంది.అభివృధ్ధి చెందుతున్న దేశలలోఈ రోజు ఒక అభిప్రాయం ఉన్నది - అభివృధ్ధి చెందిన దేశాలలో పరిశ్రమల వలన ఉన్న కాలుష్యం ముందర ఇతర దేశాల కాలుష్యం ఇప్పటికీ తక్కువే! దీనిని ఒక అంశంగా తీసుకుని,అనవసరమైన లావాదేవీలకై ఇంకనూ ప్రయత్నంచేసుకుంటూ పోతే, చైనా భారత్ బ్రజిల్‌లతో పాటు ఇతర దేశాలు కూడా అమెరికా పధ్ధతిని నిరసించే ప్రమాదం ఉన్నది.

***

ఇక పోతే నిజమైన వాతావరణ మార్పు గురించి రెండు ముక్కలు చెప్పుకుందాం. అసలు అమెరికా వాతావరణ మార్పు పేరిటమాట్లాడేది పర్యావరణం గురించే అయితే, ఆ దేశం నిజమైన క్లైమేట్ చేంజ్-ప్రపంచంలో వస్తున్న మార్పులను సరిగ్గా అర్థం చేసుకొనీ,అలవాటైపోయిన బాసిజంను పక్కన పెట్టి,వారి దృక్పథంలోనూ, దౌత్య వ్యవహారాలలోనూ మార్పుఅవసరం అని గుర్తించాలి. వారి దేశాన్ని ఒక్క సారైనా స్వీయ అధ్యయనం చేసుకోవాలి.

ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల,చైనా ఎరువుల ఎగుమతిని ఆపేయటంతో పలు దేశాలలో కూరగాయలు, పండ్లు దొరకటం మానేశాయి! ఏ దేశమూ స్వతంత్రంగా లేదు. ఇంకొకరికి నీతులు చెప్పే ముందు మన గురించి మనం ఆలోచించుకుని మనం ఎవరి మీద ఎందుకు ఆధార పడ్డాము అనేది శోధించి చూసుకోవాలి. ఆర్థిక మాంద్యం కేవలం ఆర్థికపరమైన సందేశాలను ఇవ్వటం లేదు. రాజకీయపరమైన ఒరవడులను కూడా అర్థం చేసుకుని స్వభావాలలో మార్పు తెచ్చుకోవటం అవసరం.

***

నిజం తెలియకపోయినా, న్యాయం కనపడకపోయినా రెండింటినీ కలిపే వెతకాలి.

***

చూడండి

కన్విక్షన్ ఎంతో కాలమే చెప్పాలి!

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved