19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

దిగుబడులు తగ్గనున్నాయి

గత రెండు వారాల్లో, మాన్సూన్ వర్షపాతం సాధరణం కంటే 15 శాతం అధికంగానే పడటంతో ఈ సీజన్లో వర్షాలు ఇక లేవేమోనన్న భయం నుంచికాస్త తెరిపి పడి అటు రైతన్నలు, ఇతు ప్రభుత్వ వర్గాలు ధైర్యం పుంజుకుంటున్నారు. ఐనా ఇది జూన్ -1 నుండి, జులై 22 వరకు గల కాలానికి, సాధారణం కన్నా 19 శాతం తక్కువగా నమోదయిన విషయం గమనార్హం.గత వారంలోని అధిక వర్షపాతం దేశంలోని రిజర్వాయర్లను 23 శాతం కెపాసిటీని(జల సామర్ధ్యం) నింపేసాయి. గతవారంలో 14శాతాం కెపాసిటి నీళ్ళు ఉన్నాయి. దీనివల్ల హైడ్రోపవర్ జెనెరేషన్‍(జల విద్యుత్ తయారి) కూడా పెరుగుతుందని అంచనా.

గోధుమలు, రేప్‌సీడ్ పంటలు అక్టోబర్లోకూడా వేసుకోవచ్చు

గుజరాత్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‍లలో తగినంతగా వర్షపాతం ఉండటంతో అక్కడ పత్తి, నూనెగింజల పంటలు మొదలౌతాయని భావిస్తున్నారు. చెరకు పండించేందుకు మాత్రం ఇక్కడ అనువుగా లేనట్టే! అలాగే చెరకు పంట పండించే ఉత్తర ప్రదేశ్ లోనూ, వర్షపాతం చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు. దీనివల్ల ప్రథమస్థానంలో ఉండే ఉత్తర్‍ప్రదేశ్ చెరకు ఉత్పత్తి 11 శాతం పడిపోతుందని ప్రభుత్వవర్గాలు చెబ్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే, చెరకు పంట 1,22,000 హెక్టార్లు తక్కువగా ఉండబోతోందని శరద్ పవార్ పార్లమెంటుకు తెలియజేశారు.

చెరకు పండించే మరో పెద్ద రాష్ట్రం మహరాష్ట్ర. గత పది రోజుల్లో ఇక్కడ వర్షాలు బాగానే పడ్డాయి. జలాశయల్లో నీటిమట్టాలు పెరిగాయి.గత నెలలో 20శాతం ఉన్న కృష్టా వ్యాలీలో కూడా, ఇప్పుడు 50 శాతం జలాలతో ఉన్నాయి. కృష్ట వ్యాలీ ప్రాంతంలో, సాధారణం కంటే 53 శాతం అధికంగా వర్షపాతం నమోదయినట్ట వాతావరణ గణాంకాలు చెబ్తున్నాయి.కొయన, ధోం, రాధానగరి జలాశయాలలో 70, 50మరియు 92 శాతం నీరు నిల్వలు చేరాయి. నీరు అధికంగా కావాల్సిన చెరకు పంటను మహరాష్ట్రంలోని రైతులు డాములు మీద ఆధారపడి, మాన్సూన్ సీజన్ తర్వాత వేస్తుంటారు. అయితే, జులై 20 లెక్కల ఆధారంగా - 42వేల హెక్టార్లవిస్తీర్ణంలో చెరకుపంటని ఆపేయగా, మొత్తం 747 వేల హెక్టార్లలో చెరకు పండించనున్నారని తెలుస్తోంది.

వర్షాభావ భయంతో, గత నెల్లో షుగర్ ఇండస్ట్రీ ఉత్పత్తి అంచనాలను 20 మిలియన్ టన్నుల నుంచి తగ్గించి, 17.5-18.5 మిలియన్ టన్నులుగా ప్రకటించింది. గత సంవత్సరం మన దేశం నికరంగా చక్కెర దిగుమతుదారుగానే ఉంది. ట్రేడర్ల అంచనాల మేరకు, చెరకు ఉత్పత్తి గణనీయంగా (45 శాతం) పడిపోతుంది. మొత్తం 14.7 మిలియన్ టన్నులకు చేరుతుందని వారు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా విదేశీ సంబంధాలలోభాగంగా ఎగుమతి చేసే గోధుమలను, బియ్యాన్ని ఈ సంవత్సరం చేయలేమని ఆయన పార్లమెంటులో అన్నారు.ఉత్తర్ప్రదేశ్, బీహార్‌లలో పంటలు గణనీయంగా పడిపోతున్నందున్న, ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మొక్కజొన్న (కార్న్ ) పంటలో ముందజలో ఉండే బీహారు రాష్ట్రంలో మాన్సూన్ వర్షాలు అంతగా పడలేదు.

ఏదేమైనా - ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ అహ్లువాలియా మాత్రం వచ్చే రెండువారాలను కూడా పరిగిణించిగానీ, వర్షం- పంటల పరిస్థితి మీద ఏ విషయం నిర్ధారణగా చెప్పలేమన్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved