22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్ - ముఖ్యాంశాలు, వీడని ప్రశ్నలు

రూ.1,03,485 కోట్లతో ఆర్ధిక మంత్రి రోశయ్య 2009-10 సంవత్సరపు బడ్జెట్‌ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ.16,162 కోట్లుగా చూపించారు.

బడ్జెట్ అంచనాలు(రూ. కోట్లల్లో)

మొత్తం వసూళ్ళు : 1,03,521

మొత్తం రెవెన్యూ వసూళ్ళు : 78,964

పన్నుల ద్వారా ఆదాయం : 40,664

కేంద్ర పన్నుల్లో వాటా : 12,109

పన్నేతర ఆదాయం : 12,946

గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కాంట్రిబ్యూషన్లు : 13,245మూల ధన వసూళ్ళు : 24, 557

మొత్తం వ్యయం : 1,03,485.33

ప్రణాళికా వ్యయం : 40,184.11

ప్రణాళికేతర వ్యయం: 63,301.22రెవెన్యూ వ్యయం : 76,557

మూలధన వ్యయం: 17,977

రెవెన్యూ మిగులు: 2,406

ద్రవ్యలోటు16,162.00ప్రధాన కేటాయింపులు

నీటిపారుదల : 22,418.07

విద్యుత్ సబ్సిడీ : 6,040.00

బియ్యం సబ్సిడీ : 3,500.00

గ్రామీణాభివృద్ధి : 4,958.50

పట్టణాభివృద్ధి : 3,826.75

ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమం : 3,883.98

రవాణా : 3,280.45

విద్య : 10,355.16

గృహనిర్మాణం :1,801.36

వైద్యం : 3,821.41

సామాజిక భద్రత : 1,655.70

వ్యవసాయం, అనుబంధ సేవలు : 2,612.36ముఖ్యాంశాలు:

 • ఆర్థిక మాంద్యం ప్రభావం మన రాష్ట్రంపై ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది
 • చౌక బియ్యం కోటా పెంపు, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తుకు భారీగా సొమ్ములు కేటాయింపు.
 • జలయజ్ఞానికి పెద్దపీట వేశారు.


గమనార్హం:

 • రాష్ట్ర రుణ భారం : 1,10,000 కోట్లు
 • ద్రవ్యలోటు రెండేళ్లలో రెట్టింపయింది
 • ప్రణాళికేతర వ్యయాన్ని 22 శాతం పెంపు
 • ప్రణాళికా వ్యయంలో 15 శాతం కోత
 • ప్రణాళికా వ్యయానికి కళ్లెం వేయడం ద్వారా రెవెన్యూ మిగులు చూపడం జరిగింది
 • ప్రత్యేకంగా విడుదల చేసిన పత్రాల్లో ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా మూడు వేల కోట్లు సముపార్జించినున్నట్టు పేర్కొన్నారు
 • మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నతరుణంలో మరింత ఆదాయాన్ని సమకూర్చుకోగలమన్న ఆశపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
 • క్రితం ఏడాది లక్ష కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టినా, సవరించిన అంచనా ప్రకారం దాని అసలు పరిమాణం 90 వేల కోట్లే! వాస్తవిక ఖర్చు ఇంకా తగ్గడం ఖాయం.

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved