22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రాబడులు పెరిగినా ఆర్ధిక స్వస్థత అనుమానమే

శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, వొడాఫోన్ మరియు 3యం(3M) చూపించిన అధిక లాభాలు, అంతర్జాతీయంగా కొంతమంది మదుపుదారులకు ఆశలను రేకెత్తించాయి. కానీ, విశ్లేషకులు, మార్కెట్ సంస్థల ఉద్యోగులు మాత్రం ఇంకా వెరుస్తూనే ఉన్నారు. ఆర్ధికస్థితి అంత వేగంగా మెరుగుపడుతుందని విశ్లేషకులు అనుకోవటం లేదు. పోయిన ఏడాది గృహఋణాల మార్కెట్టు కుప్పకూలగా, 1930ల్లోని ఆర్ధికసంక్షోభ్భాన్ని తలపించి భయపెడుతున్న ఆర్ధికస్థితిగతుల వల్ల, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను మార్కెట్లో కుమ్మరించి, ప్రపంచ ఆర్ధికస్థితిని మెరుగుపర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నం కొద్దిగా సఫలీకృతం ఐనట్టుగా కనిపిస్తున్నా, ఇది కొనసాగగలుగుతుందా అని అనుమానపడుతున్నారు.

కొరియన్ ఫలితాలు

గత శుక్రవారం సౌత్ కొరియన్ ఆర్ధిక గణాంకల వల్ల, ఆర్ధికస్థితి మెరుగుపడి , గత ఐదేళ్ళకంటే వేగంగా ఈ ద్వితీయ త్రైమాసికంలో ఆర్ధిక పెరుగుదల ఉన్నట్టు భావిస్తున్నారు.ఇది ప్రభుత్వం కుమ్మరించిన డబ్బుల వల్ల వచ్చిందా లేక నిజంగానే డిమాండు పెరుగుతున్నదా అనే విషయం ఇంకా అనుమానమే. కొరియన్ దేశీ డిమాండు పెరుగుదల కారు కొనుగోళ్ళపై ఇచ్చిన పన్ను రాయితల వల్ల కూడా పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. కానీ ఉద్యోగాలు పెరిగినట్టుగా లెక్కతెలీటం లేదని బ్యాంక్ ఆఫ్ కొరియా చెబ్తున్నది.

యూకె ఫలితాలు

బ్రిటన్ ఆర్ధికస్థితి కుచించుకు పోయింది. ఊహించినదానికంటే రెండితల వేగంతో ఈ ద్వితీయ త్రైమాసిక ఫలితాలు పడిపోయాయి. 1955 తరువాత ఇప్పుడే అత్యధికంగా తిరోగమనం కనుబడుతోంది. రెండో త్రైమాసిక జిడిపి 0.8 శాతం పడిపోగా, సంవత్సరానికి గానూ 5.6 శాతం పడిపోయింది. పోయిన త్రైమాసికంలో 2.4 శాతం పడిపోయినప్పుడు, విశ్లేషకులు ఈ త్రైమాసికంలో 0.3 శాతం పడిపోతుందని అంచనా వేశారు. గత ఐదు త్రైమాసికాలుగా పడిపోతూనే ఉంది. మొత్తంగా కలుపుకొని, క్యుములేటివ్‍గా, ఇది 5.7శాతం క్షీణించనట్టు. 90వ దశకంలోను ఆర్ధికమాంద్యానికి ఇది రెట్టింపు కాగా, 80ల్లోని 6.4 కాంట్రాక్షన్‍కి(క్షీణతకు) చేరువలోనే ఉన్నట్టు.

దీన్ని బట్టి యూకెలో రికవరీ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం పట్టేట్టే ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాడ్ మరిన్ని ప్యాకీజీలు ఇస్తుందని ఊహ. ఇప్పటికే, వడ్డిరేట్లు కనిష్ఠ స్థాయిలకు తగ్గించింది. 125 బిలియన్ పౌండ్లకు గానూ ప్యాకేజిలను ఇచ్చింది.

కొంచెం లోతుగా చూస్తే, గత దశాబ్దంలో ఎదుగుతూ వచ్చిన బిజినస్ సర్వీసెస్ మరియు ఫైనాన్స్ సెక్టారు కూడా పడిపోతోందని తెలుస్తోంది.

జాగురూకలై ఉండటమే

ప్రభుత్వ స్టిమ్యులస్‍ల(ఉత్ప్రేరకాలు) వల్ల, చాలా కంపెనీలు ఫోర్కాస్టులకు మించి ఈ సీజన్లో ఫలితాలు సాధించారు. కానీ, ఆర్ధికస్థితి మొత్తంగా ఐతే ఇంకా రికవరీ బాట పట్టలేదు. పట్టినా, అలా కొనసాగిస్తాయా లేదా అనేది వేచి చూడవలసిందే.

మెమరీ చిప్పులనూ, LCD స్క్రీన్లను తయారుచేస్తున్న శామ్సంగ్ , గత రెండున్నర ఏళ్ళలో మించిన త్రైమాసిక ఫలితాలను ఈసారి చూపించనా, భవిష్యత్తు గురించి జాగ్రత్తగా అంచనాలు వేస్తున్నట్టు చెప్పింది. అమెరికాలోను 3M, ఫోర్కాస్టులకు మించిన ఫలితాలను చూపించి, అదే షేరు ధరలు ఆరు శాతం పెంచుకుంది. కానీ, ఆర్ధిక స్థితిగతుల వల్ల జాగ్ర్రత్తగానే ఉంటామంది.

మైక్రోసాఫ్టు మాత్రం బిలియన్ డాలర్ తగ్గుదల చూపించి, ప్రపంచవ్యాప్తంగా పిసీలు,కంప్యూటర్ల కొనుగోళ్ళు పడిపోవటాన్ని కారణంగా చెప్పింది. ఈ సంవత్సరం ఇంతే,ఇప్పుడే బాగుపడదని తేల్చి చెప్పారు సంస్థ CFO క్రిస్టొఫర్ లిడ్డెల్ల్.

ఆశియా మార్కెట్లు మాత్రం పదినెలల శిఖరాన్ని తాకాయి. లేమన్ బ్రదర్స్ పతనానికి ముందున్న స్థితికి హాంకాంగ్ ఎగబాకింది.

ఐనా, మార్కెట్లో లాభాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. కొందరు మదుపుదారులు ఈ ఎదుగుదలలో లాభాన్ని బుక్ చేసుకున్నారు. దాని వల్ల, అధిక యీళ్డ్ ఉన్న కరెన్సీల ధరలు పడిపోయినాయి. అందుచేత, ఈ అలలోని రిస్కీ అసెట్స్ అన్నీ, మళ్ళీ కిందకి పడతాయని అనిపిస్తోంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved