19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సాగర గరళాన్ని శుద్ధి చేసిన ఆనంద చక్రవర్తి

ఒక జీవిని తయారు చేసి పేటెంట్ సంపాదించిన మొదటి శాస్త్రవేత్త

సముద్రం అనేక జంతువృక్ష జాతులకు ఆవాసం. భూమిపైన ఉన్న జీవరాశి కన్నా ఎక్కువ జీవులు సముద్రాల్లో నివసిస్తుంటాయి. కానీ మానవ తప్పిదాల వలన వాటికి అనేక రకాలుగా ముప్పు ఏర్పడుతుంటుంది. చమురు(క్రూడ్ ఆయిల్) తీసుకెళ్ళే ఓడల ప్రమాదాల వలన నీటిపై చమురు తెట్టు ఏర్పడుతుంది. ఇది కిలోమీటర్ల విస్తీర్ణం వ్యాపించి అక్కడ జీవులకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. అంతేకాదు అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యంకాదు అనుకునేవారు. ఓ భారతీయ శాస్త్రవేత్త ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆయనే ఆనంద చక్రవర్తి.

1938, ఏప్రిల్ 4న భారతదేశంలో జన్మించిన ఆనంద చక్రవర్తి తరువాత అమెరికాలో స్థిరపడ్డాడు. 1971లో అమెరికాలోని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో బయోకెమిస్ట్ గా ఉద్యోగం చేస్తూ ఆయన చేసిన పరిశోధన నూతన ఆవిష్కరణకు దారితీసింది. సమ్రుదంలో తేలియాడే ముడి చమురు తెట్టును విడగొట్టి అక్కడి జీవులకు ఆహారంగా పనికొచ్చేట్లు చేయగల ఏకకణ బాక్టీరియా (సూడోమోనాస్ - Psuedomonas )ను ఆయన కనుగొన్నారు.

ముడి చమురు తెట్టును తొలగించగల నాలుగు రకాల బాక్టీరియాలు అప్పటికే ఉన్నాయి. అయితే అవి ఒకదానితో ఒకటి పోటీపడటంతో సముద్రతలంలో చమురు తెట్టును సమర్ధవంతంగా తొలగించలేక పోయేవి. ఈ బాక్టీరియాలలోచమురును "తినేసే" గుణం వాటిలోని ప్లాస్మిడ్ కణాలలో నిక్షిప్తమై ఉంటుంది.ప్లాస్మిడ్లు క్రోమోజూములతొ సంబంధంలేని డిఎన్‌ఎ కణాలు. చక్రవర్తి తన పరిశోధనల ద్వారా ఈ నాలుగు రకాల బాక్టీరియాలలోని ప్లాస్మిడ్లను కలగలిపి ఒకే జీవిలో ఉండే విధంగా ఒక కొత్త బాక్టీరియా జాతినితయారు చేశారు (ప్రస్తుతం దీనిని 'బర్కోల్డెరియా (Burkholderia)' అని పిలుస్తున్నారు). ఆయన మాటల్లోనె అది "multi-plasmid hydrocarbon-degrading Pseudomonas ," దానితో ప్రపంచం తలబద్దలు కొట్టుకుంటున్న సమస్య సులభంగా తీరింది.

జీవానికి పేటెంట్ ఇవ్వవచ్చా....

ఈ కొత్త బాక్టీరియాపైతనకు పేటెంట్ కావాలని 1971లో ప్రయత్నించగా మొదట తిరస్కారం ఎదురైంది. ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అప్పటి వరకు ప్రాణమున్న జీవులపై పేటెంట్ ఇవ్వబడలేదు. కనుక దిగువ న్యాయస్థానం తీర్పు నిరాశను మిగిల్చింది. చివరికి ఆయన అమెరికా సుప్రీంకోర్టుకు వెళ్ళి 1980 జూన్ లో పేటెంట్ ను సాధించాడు. మానవ మేధొశ్రమ నుండి వెలికితీయబడిన నూతన విషయం కాబట్టి పేటెంట్ ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాజెనెటిక్ఇంజనీరింగ్ ద్వారా తయారైనబాక్టీరియాకు పేటెంట్ పొందిన మొదటి వ్యక్తిగా చక్రవర్తి పేరుగడించాడు.

తరువాతి కాలంలో ఆయన అనేక పరిశోధనలు చేపట్టారు. విద్యారంగంలో సేవలు అందించారు. వివిధ ప్రభుత్వ,అంతర్జాతీయ కమిటీలలో తన సేవలను అందించడంతో పాటు న్యాయమూర్తులకు సలహాదారుగా కుడా పనిచేశారు. షికాగో లోని యునివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ శాఖలలో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గా ఆయన పనిచేస్తున్నారు.

ఆయన సిడిజీ థెరప్యుటిక్స్ అనేసంస్థను అమెరికాలోని డెలావేర్ లో స్థాపించారు. బ్యాక్టీరియాలతో క్యాన్సర్ ను నివారించడంపై ఇక్కడ అనేక పరిశోధనలు జరిగుతున్నాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్ పై జరుపుతున్న పరిశోధనలో అనుకోకుండా క్యాన్సర్ నివారణకు బాక్టీరియా పనికొస్తుందన్న విషయాలను ఆయన కనుగొన్నారు. "సైన్స్ లో ఉన్న ఆనందమే అది! ఎటునుండి ఎటు తీసుకువెడుతుందో చెప్పలేం. ఇంతకు ముందు నాకు క్యాన్సర్ గురించి తెలిసింది బహు తక్కువ" అంటారు ఆనంద చక్రవర్తి.

బాక్టీరియాకు పేటెంట్ హక్కు సాధించిడం ద్వారా ఆనంద చక్రవరి జెనెటిక్ ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని విశ్లేషకులు భావిస్తారు.

జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగంలో ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2007లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved