19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కృష్ణ పక్షము - స్వేచ్చాగానము - 1

తిమిరలత తారకా కుముమముల దాల్ప

కర్కశ శిలయి నవజీవ కళల దేర

మ్రోడు మోక చివురు లెత్తి మురువు సూప

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య

శృంఖలములు తమంతనె చెదరి పోవ

గగనతలము మా ర్ర్మోగగ కంఠ మెత్తి

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.చిత్త మానందమయ మరీచికల సోల

హృదయ మానంద భంగమాలికల దేల

కనుల నానంద జనితా శ్రుకణము లూర

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.యుగయుగంబుల నీశ్వరయోధు లగుచు

స్వేచ్ఛకై ప్రాణసుమము లర్పించువారి

అమల జీవిత ఫలము ధన్యతను గాంచ

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.భయము గలిగించు కష్టాతపంబు మరచి

కరము కలగించు వంత చీకట్లు మరచి

విశ్వమే పరవశ మయి వెంట బాడ

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.

XML Error:
Mismatched tag
38

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved