19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కృష్ణ పక్షము - ఆకులో ఆకునై

ఆకులో ఆకునై ఫువులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ యడవి దాగిపోనా

ఏట్లైన

నిచటనే యాగిపోనా?

గల గలని వీచు చిరుగాలిలో కెరటమై

జల జలని పారు సెలపాటలో తేటనై

ఈ యడవి దాగిపోనా

ఏట్లైన

నిచటనే యాగిపోనా?

పగడాల చిగురాకు తెరచాటు తేటినై

పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై

ఈ యడవి దాగిపోనా

ఏట్లైన

నిచటనే యాగిపోనా?

తరు లెక్కి యల నీలగిరి నెక్కి మెలమెల్ల

చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఈ యడవి దాగిపోనా

ఏట్లైన

నిచటనే యాగిపోనా?

ఆకలా దాహమా చింతలా వంతలా

ఈ కరణి వెర్రినై యేకతమ తిరుగాడ

ఈ యడవి దాగిపోనా

ఏట్లైన

నిచటనే యాగిపోనా?


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved