19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మధ్యయుగ భారతదేశం - సామాజిక పరిస్థితులు

భూస్వామ్య లక్షణాలు ప్రాముఖ్యంలోకి వచ్చాయి. రాజుల పరిస్థితి బలహీనపడింది. భూస్వామ్య సంబంధానికి చెందిన సైనిక విషయం అంటే రాజులకు అవసరమైనప్పుడు దళాలను సరఫరా చేయవలసిన భూస్వాముల బాధ్యత, వివిధ రాజ్యాల మధ్య మరింత తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండటంతో క్రమంగా ముఖ్యమైన అంశంగా మారింది. గ్రామాలు స్వయం సమృద్ధి, ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడ్డాయి. ఉత్పత్తి దాదాపు స్థానిక అవసరాలకు సరిపోయేట్లుగా మాత్రమే ఉండేది. వర్తకానికి ఉపయోగించే నిమిత్తం మిగులును ఉత్పత్తి చేసే ప్రయత్నం చాలా తక్కువగా ఉండేది. భూస్వామి ఎక్కువ వాటా కోసం డిమాండ్ చేస్తాడు. కాబట్టి మిగులు ఉత్పత్తి రైతుకు ఏమంత లాభం చేకూర్చేది కాదు. సాథనికమైన తూనికలూ, కొలతలూ రావడంతో వర్తకానికి మరింత అవరోధం ఏర్పడింది.

వీరోచిత గుణాలను పుట్టినప్పటి నుంచే పిల్లల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. యుద్ధం నుంచి తప్పించుకునే వానిని హీనంగా చూసేవారు. స్త్రీలు కూడా వీరోచితంగా పోరాడిన పురుషులను అభిమానించేవారు. స్వచ్ఛందంగా అయినా గానీ, బవంతంగా అయినా గానీ ʻసతీసహగమనంʼ, నాటి ఆచారంగా ఉండేది. న్యాయపరమైన రచన, సమకాలీన ఉపయోగం కోసం పాత గ్రంథాలనూ అంగీకరించే ధోరణిని ప్రతిబించబించింది. ఫలితంగా మనుధర్మశాస్త్రం లాంటి ప్రాచీనమైన రచనలకు వివరణాత్మకమైన వ్యాఖ్యానాలు వచ్చాయి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పనితీరులో శ్రామిక ప్రత్యేకీకరణ వల్ల గ్రామాలలో స్వర్ణకారులు, తాళ్లు పేనేవారు వంటి ఉపకులాలు అభివృద్ధి చెందాయి. వివిధ కులాలూ, ఉపకులాలూ ఏర్పడి స్వీయ ప్రచయోజనాల కోసం పాటుపడటం ప్రారంభించాయి. ఈ సంఘాలు, రాజకీయ విధేయతలను బలహీనపరిచాయి. గ్రామాలలోని కులపంచాయతీలు, నిర్ణీత కులానికి సంబంధించి, సర్వోన్నత అధికారంగా ఉండేవి.

సాంకేతికపరమైన వృత్తులను హీనంగా చూడం వల్ల సాంకేతిక నైపుణ్యాలలో ప్రగతికి అవరోధం ఏర్పడింది.

ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి
SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved