19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మధ్యయుగ భారతదేశం-రాజపుత్ర రాజ్యాలు

రాజపుత్రుల మూలం గురించి ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ రాజపుత్రులు, ఉత్తర, పశ్చిమ భారతదేశంలో స్థిరపడిన హూనుల సంతతికి చెందినవారై ఉండవచ్చు లేదా హూణ ముట్టడిదారులతో పాటు భారతదేశంలోకి వచ్చిన తెగలకూ ప్రజలకూ చెందిన వారై ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని అధిక సంఖ్యాకులు అంగీకరిస్తున్నారు. వివిధ రాజపుత్ర తెగలలో నాలుగు తెగలు (మలిప్రాతిహారులు, చౌహానులు, పోలంకులు, పరామరులు) తమకు ప్రత్యేకస్థాయిని ఆపాదించుకొంటున్నాయి. ఈ తెగలవారు, మౌంట్ అబూ సమీపంలోని ఒక అగ్నికుండం నుంచి పైకి వచ్చిన ఒక దివ్యపురుషుడి వారసులమని పేర్కొనడమే కాకుండా తమను తాము అగ్నికుల క్షత్రియులుగా చెప్పుకొన్నారు.

పరిహారులు లేదా మలిప్రాతిహారులు

పూర్వపు ప్రాతిహారుల శిథిలాల మీద వీరు తమరాజ్యాన్ని స్థాపించుకొని, దక్షిణ రాజస్థాన్ ను పాలించారు.

చౌహాన్ లు (క్రీ.శ.956-1192)

వీరు పరిహారులకు సామంతులు, అరబ్బుల దాడులను నివారించడంలో వారికి తోడ్పడ్డారు. వీరు 'సాకంబరి' రాజధానిగా తూర్పు రాజస్థాన్ ను పాలించారు. ఈ వంశ స్థాపకుడయిన సింహరాజ్, అజ్మీర్ పట్టణాన్ని నిర్మించాడు. మరో చౌహాన్ రాజయిన విశాల దేవుడు, గజనీలనూ, తోమారులనూ ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు. విశాలదేవుడు 'హర్షకేళి' ని రచించాడు. అజ్మీర్ లో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. చౌహాన్ రాజులందరిలోకీ గొప్పవాడయిన పృధ్వీరాజు క్రీ.శ.1191లో జరిగిన మొదటి తరైన్ యుద్ధంలో గోరి మహమ్మద్ ను ఓడించాడు. అయితే రెండో తరైన్ యుద్ధం (1192) లో గోరీ మహమ్మద్, ఇతనిని ఓడించి, హతమార్చాడు.

సోలంకులు (క్రీ.శ.945-1297)

మలి చాళుక్యులుగా కూడా ప్రసిద్ధులయిన వీరు 'అన్హిల్వాడ' రాజధానిగా గుజరాత్ ను పాలించారు. మూలరాజు పాలనాకాలంలో వీరు ప్రాముఖ్యంలోకి వచ్చారు. మొదటి భీముడి కాలంలో గజనీ మహమ్మద్, సోమనాథాలయాన్ని కొల్లగొట్టాడు.

పరామరులు

వీరిని పవార్ లని కూడా అంటారు. ధార్ (మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపం) రాజధానిగా మాల్వను పాలించారు. వీరు రాష్ట్రకూటులకు సామంతులు. ఉపేంద్రుడు లేదా కృష్ణరాజు ఈ వంశ స్థాపకుడు. ఈ వంశంలో ముంజరాజు అతిగొప్పరాజు. ఈయన నీటి పారుదల నిమిత్తం 'ముంజసాగరం' అనే చెరువును తవ్వించాడు. భోజరాజు , 'భోజశాల' అనే సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశాడు. ఈయన, ధనపాలుడు, శాంతిసేనుడు, శోభన, ప్రభాచంద్రసూరి, విజ్ఞానేశ్వరుడు వంటి సాహితీవేత్తలను ఆదరించాడు.

గహద్వాలులు (క్రీ.శ.1085-1202)

రాథోడ్ లుగా కూడా ప్రసిద్ధులయిన వీరు, కనౌజ్ రాజధానిగా పాలన సాగించారు. ఈ వంశ స్థాపకుడు చంద్రసేనుడు . గోవిందచంద్రుడు అందరిలోకీ గొప్పరాజు. గహద్వాలరాజు జయచంద్రుడి కుమార్తె అయిన సంయుక్తని పృధ్వీరాజ్ చౌహాన్ బలవంతంగా తీసుకుపోయి వివాహం చేసుకొన్నాడు. పృథ్వీరాజ్ పై గోరీ మహమ్మద్ దాడిచేసినప్పుడు జయచంద్రుడు పృధ్వీరాజుకు సాహయపడలేదు. తరవాత గోరీ మహమ్మద్ జయచంద్రుడిని కూడా ఓడించాడు.

కాచూరులు (845-1212)

కొక్కలుడు త్రిపుర రాజధానిగా కాలచూరుల ఛేది రాజ్యాన్ని స్థాపించాడు. కాలచూరి వంశానికి చెందిన గంగయదేవుడి, వివిధ ప్రాంతాలను జయించిన తరవాత 'త్రికళింగాధిపతి', 'విక్రమాదిత్య' అనే బిరుదులు గ్రహించాడు.

ఛండేలాలు

వీరు ప్రాతిహారుల సామంతులు. ఈ వంశ స్థాపకుడు జయశక్తి . ఇతను, ఖజురహో రాజధానిగా బుందేల్‌ఖండ్ ను పాలించాడు. మరో ఛండేలా పాలకుడయిన ధంగ , టర్కిష్ దాడులను తిప్పికొట్టడంలో హిందూషాహి పాలకుడు జయపారుడికి సాహాయం చేశాడు. గండరాజు , క్రీ.శ.1022లో గజనీ మహమ్మద్ తో సంధి చేసుకొని అనేక బహుమానాలు ఇచ్చాడు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ, బుందేల్‌ఖండ్‌ను జయించడంతో ఛండేలా వంశం అంతమైంది.

ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి




SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved