19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మధ్యయుగ భారతదేశం - రాష్ట్రకూటులు

దంతిదుర్గుడు (క్రీ.శ.753-756)

చాళుక్యరాజు రెండో విక్రమాదిత్యుడికి మహాసామంతుడు. క్రీ.శ.8వ శతాబ్దం ప్రథమార్థంలో విక్రమాదిత్యుడి కుమారుడూ, వారసుడూ అయిన రెండో కీర్తివర్మను ఓడించి, మాల్ఖేడ్ లేదా మాన్యకేతం రాజధానిగా రాష్ట్రకూట వంశాన్ని స్థాపించాడు. దాదాపు క్రీ.శ. 756 లో ఇతని స్థావరాన్ని ఇతని పినతండ్రి మొదటి కృష్ణుడు ఆక్రమించాడు.

కృష్ణుడు-I (క్రీ.శ.756-775)

చాళుక్యురాజు రెండో కీర్తివర్త అధికారానికి తుది దెబ్బతీశాడు. మైసూరు గాంగులూ, వేంగి విష్ణువర్ధనుడు తన ఆధిపత్యాన్ని అంగీకరించేట్లు చేశాడు. ఇతని కుమారుడు రెండో గోవిందుడిని, క్రీ.శ. 780 ప్రాంతంలో ఇతని తమ్ముడయిన మూడో ధ్రువుడు పదవీచ్యుతుణ్ణి చేశాడు.

ధ్రువుడు (క్రీ.శ.780-792)

పల్లవులపై దాడిచేసి విజయం సాధించాడు. త్రైపాక్షిక పోరాటంలో జోక్యం చేసుకొన్న మొదటి రాష్ట్రకూట రాజు ఇతనే. ప్రాతిహార వత్సరాజునూ, పాలరాజు ధర్మపాలుడినీ ఓడించాడు. ఈ విజయం తరవాత ఈయన తన సామ్రాజ్య చిహ్నానికి గంగ-యమున ఎంబ్లమ్ ను చేర్చాడు. ఇతని తరవాత మూడో గోవిందుడు అధికారానికి వచ్చాడు.

గోవిందుడు-III (క్రీ.శ.792-814)

రాష్ట్రకూట వంశానికి చెందిన అతి గొప్ప పాలకులలో ఒకడు. ప్రాతిహారరాజు రెండో నాగభట్టును ఓడించి, మాల్వను ఆక్రమించుకొని, దాన్ని పరామరవంశానికి చెందిన ఉపేంద్రునికి అప్పగించాడు. తనకు వ్యతిరేకంగా గాంగ, చేర, పాండ్య, పల్లవ రాజులు ఏర్పాటు చేసిన సమాఖ్యను చెదరగొట్టాడు. ఇతని తరవాత, ఇతని కుమారుడయిన మొదటి అమోఘవర్షుడు అధికారానికి వచ్చాడు.

అమోఘవర్షుడు-I(814-878)

రాష్ట్రకూట వంశానికి చెందిన అతి గొప్ప పాలకులలో ఒకడు. ఇతను గాంగులతోనూ, తూర్పు చాళుక్యులతోను సుదీర్ఘ పోరాటాలు సాగించాడు. స్వయంగా కవి అయిన ఈయన ప్రాచీన కన్నడ ఛందోశాస్త్రమయిన ʻకవిరాజమార్గాʼన్ని రచించాడు. జినసేనుడు (ఆదిపురాణ రచయిత), మహావీరాచార్య (గణితసార సంగ్రహ రచయిత), సాక్త్వాయనుడు (అమోఘవృత్తి రచయిత) వంటి సాహితీవేత్తలను ఆదరించాడు. గొప్ప భవన నిర్మాత కూడా అయిన ఈయన మన్యకేత నగరాన్ని నిర్మించాడు. ఇతని తరవాత ఇతని కుమారుడురెండో కృష్ణుడు అధికారానికి వచ్చాడు.

కృష్ణుడు-II (878-915)

ఇతను ప్రాతిహార భోజుడితో విజయవంతంగా పారాడాడు కానీ వేంగి గుణగ విజయాదిత్యుడు, రాష్ట్రకూట రాజ్యంపై ఆధిపత్యం సాధించాడు. ఇతని తరవాత ఇతని మనుమడు మూడో ఇంద్రుడు రాజ్యానికి వచ్చాడు.

ఇంద్రుడు-II (915-927)

ప్రాతిహార రాజు మొదటి మహీపాలుడిని ఓడించి, అతని రాజధాని కనౌజ్ ను దోచుకొన్నాడు.

కృష్ణుడు-III (939-967)

చోళరాజు మొదటి పరాంతకుడిని ఓడించి, తొండ మండలాన్ని ఆక్రమించుకొని, రామేశ్వరంలో విజయస్తంభాన్నీ, ఆలయాన్నీ నిర్మించాడు. పొరుగు రాజ్యాలన్నిటి మీదా యుద్ధాలు ప్రకటించి, ఆయా రాజులను దూరం చేసుకోవటం ద్వారా తన వారసులకు సమస్లు సృష్టించాడు.

మూడో కృష్ణుడి తరవాత, అతని తమ్ముడు కొట్టిగ రాజ్యానికి వచ్చాడు. ఇతనిని క్రీ.శ.973లో పరామర సియక్-II ఓడించాడు. కొట్టిగ తరవాత రాజ్యానికి వచ్చిన రెండో కర్కను క్రీ.శ. 974లో చాళుక్యరాజు రెండోతైలుడు పదవీచ్యుతుణ్ణి చేశాడు.

ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి
SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved