19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మధ్యయుగ భారతదేశం - ప్రాతిహారులు

గూర్జర (నైరుతి రాజస్థాన్) అనే ప్రాంతానికి చెందిన ప్రాతిహారులను గూర్జర ప్రాతిహారులని కూడా పేర్కొంటారు. సింధునుంచి రాజస్థాన్లోకి అరబ్బుల చొరబాట్లను ప్రతిఘటించడం వల్ల ప్రాతిహారులు ప్రాముఖ్యంలోకి వచ్చారు.

నాగభట్టు-I (క్రీ.శ.725-750)

అవంతి రాజధానిగా ప్రాతిహార వంశాన్ని స్థాపించాడు. అరబ్బుల మీద ఇతను సాధించిన విజయాన్ని భోజుడు గ్వాలియర్ శాసనంలో ప్రస్తావించడం జరిగింది.

దేవరాజు (క్రీ.శ.750-775)

ఇతను రాష్ట్రకూటరాజు దంతుదుర్గిడి చేతిలో ఓడిపోయాడు.

వత్సరాజు (క్రీ. శ.775-800)

తొలి ప్రాతిహార రాజులలో గొప్పవాడు. ధర్మపాలుడిని ఓడించి, తన సామ్రాజ్యాన్ని బెంగాల్ వరకూ విస్తరింప జేశాడు. అయితే ఇతను, రాష్ట్రకూట రాజు మూడో ధ్రువుడిచేతిలో ఓడిపోవడంతో కమౌజ్ ను వదులుకోవలసి వచ్చింది.

నాగభట్టు II (800-825)

కనౌజ్ లో ధర్మపాలుడి ఆశ్రయంలసో ఉన్న చక్రాయుధను ఓడించాడు. పంజాబ్, బెంగాల్ ల మధ్య ఉన్న ప్రాంతాన్ని కొంతకాలంపాటు పాలించాడు. ఇతనిని రాష్ట్రకూట రాజు మూడో గోవిందుడు ఓడించాడు.

మిహిర భోజుడు (836-885)

ఇతనిని ప్రాతిహారులందరిలోకీ గొప్పవాడుగా పరిగణిస్తారు. రాష్ట్రకూటరాజు మూడో కృష్ణుడిని ఓడించి, కనౌజ్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అయితే, తూర్పు ప్రాంతంలో తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలనే భోజుడి కోరికకు పాలరాజు దేవరాజు అడ్డుకట్ట వేశాడు. ఇతను విష్ణుభక్తుడు. ʻఆదివరాహʼ అనే బిరుదు స్వీకరించాడు. తన నాణేల మీద ఆదివరాహాన్ని ముద్రించాడు.

మహేంద్రపాలుడు-I(885-910)

మిహిరభోజుడి కుమారుడూ, వారసుడూ, కర్పూరమంజరి, కావ్యమీమాంస మొ।।వంటి గ్రంథాల రచయిత అయిన రాజశేఖరుడు. ఈయన ఆస్థానాన్ని అలంకరించి ఉండేవాడు. మగధ, ఉత్తర బెంగాల్ లలో అధిక భాగాన్ని ఈయన జయించాడు.

మహేంద్రపాలుడి తరవాత రెండోభోజుడు (క్రీ.శ.910-912)స మహీపాలుడు (క్రీ.శ.912-944) అధికారంలోకి వచ్చారు. వీరిలో చివరి ముఖ్యమైన పాలకుడు రాజ్యపాలుడు . ఇతని పాలనా కాలంలోనే క్రీ.శ. 1018లో జరిగిన గజనీ మహమ్మద్ దండయాత్రతో ప్రాతిహారుల పాలన అంతమైంది.

ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి
SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved