19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మధ్యయుగ భారతదేశం -పాలరాజులు

గోపాలుడు (750-770)

క్రీ.శ.750లో వ్యవహారాలను సరిదిద్దడం కోసం భూస్వాములు ఇతనిని ఎన్నుకొన్నారు. రాజ్యంలో శాంతిని స్థాపించడంలో ఇతను సఫలుడయ్యాడు. పాటలీపుత్రం రాజధానిగా 20 సంవత్సరాలపాటు పాలన సాగించాడు.

ధర్మపాలుడు (770-810)

పాలరాజులందరిలోకి గొప్పరాజుగా ఇతనిని పరిగణిస్తారు కనౌజ్ సింహాసనం మీదినుంచి ఇంద్రాయుధను తొలగించి, చక్రాయుధను ఎక్కించడం ద్వారా కనౌజ్ పై గణనీయమైన కాలం ఆధిపత్యం సాధించాడు. అయితే, ప్రాతిహార రాజులయిన వత్సరాజు, రెండో నాగభట్టు, రాష్ట్రకూటరాజులయిన మూడో ధ్రువుడు, మూడో గోవిందుడు ఇతనిని ఓడించారు. విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకుడు ఇతనే.

దేవపాలుడు (810-850)

బాదల్ స్తంభ శాసనం ప్రకారం ఇతను ఉత్కళ, కామరూప (అస్సామ్), గూర్జర (అప్పుడు ప్రాతిహార రాజు రామభద్రుడు పాలిస్తున్నాడు) రాజులను ఓడించాడు. అయితే, ఆ తరవాత ప్రాతిహార మిహిర భోజుడు ఇతనిని ఓడించాడు.

నారా మణిపాలుడు (858-912)

పాల వంశానికి చెందిన ఇతను శివారాధన కోసం వెయ్యి దేవాలయాలు నిర్మించానని భాగల్పూరు శాసనంలో చెప్పుకొన్నాడు.

మహీపాలుడు (968-1038)

ఇతని పాలనాకాలంలో మొదటి రాజేంద్రచోళుడి సైన్యాలు, గంగానదిని దాటి పాల భూభాగంపై విజయవంతంగా దాడిచేశాయి. ఈ విజయానికి గుర్తుగా మొదటి రాజేంద్రుడు, 'గంగైకొండ' బిరుదం గ్రహించడమే కాకుండా గంగైకొండ చోళపురం అనే కొత్త నగరాన్ని నిర్మించాడు.

ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి
SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved