19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

టెలిగ్రాఫ్ రూపశిల్పి శామ్యూల్ మోర్స్

By డి, హనుమంతరావు

చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించి శాస్త్రవేత్తగా మారిన మోర్స్, పట్టుదల గల పరిశోధకుడికి సిసలైన ఉదాహరణ. ఊహకు-ఆచరణకు తీగద్వారా అనుబంధాన్ని పేర్చిన మహనీయుడు.

శామ్యూల్ ఎఫ్.బి.మోర్స్ అమెరికాలోని చార్లెస్ టౌన్ లో 1791, ఏప్రిల్ 27న జన్మించాడు. తండ్రి జియోగ్రాఫర్ కావడంతో ప్రకృతిని ప్రేమించడం నేర్చుకున్నాడు. చిన్ననాటి నుండి చిత్రలేఖనంలో ఆసక్తి ఉండేది. ఇంగ్లాండ్ లోని యేల్ విశ్వవిద్యాలయంలో(1811-15) చిత్రలేఖనాన్ని అధ్యయనం చేసి పట్టభద్రుడయ్యాడు. వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఆయా ప్రాంతాలను చ్రితించటం మొదలుపెట్టాడు. కొందరు చ్రితకారులతో కలిసి 'నేషనల్ అకాడమి ఆఫ్ డిజైన్' అనే సంస్థను ఏర్పరచి 1826 నుండి 1845 వరకు తానే వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగాడు.

దూరాన్ని చెరిపేసిన మోర్స్ కోడ్

నలభై ఏళ్ళ వయస్సు వచ్చే వరకు మోర్స్ కేవలం చిత్రలేఖనంపైనే శ్రద్ధ వహించాడు. 1832లో యూరప్ యాత్ర ముగించుకొని తిరిగి అమెరికా ప్రయాణం అయ్యాడు. ఆ ప్రయాణంలో జరిగిన సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పింది. చార్లెస్ జాక్సన్ అనే పరిశోధకుడు తాను కనుగొన్న విద్యుదయస్కాంతాన్ని వివరించాడు. ఆ విషయం అయాస్కాంతం వలే మోర్స్ ను పట్టేసింది. విద్యుదయస్కాంత భావనను ఉపయోగించి సమాచారాన్ని ఎందుకు ప్రసారం చేయలేము అని ఆలోచించి, ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు.

1832-35 మధ్య మూడేళ్ళు శ్రమించి టెలిగ్రాఫ్ ను రూపొందించాడు. ఎంత దూరమైనా సరే తీగ ద్వారా ఇవతలి నుండి అవతలికి సంకేతం పంపగల టెక్నాలజీయే 'టెలిగ్రాఫ్'. ఆ సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపడానికి ఒక పద్దతి అవసరమయింది. మరో మూడేళ్ళు శ్రమించి 1838లో చుక్కలు, గీతలతో కోడ్ కనిపెట్టాడు. అదే మోర్స్ కోడ్ గా అతర్జాతీయ ఖ్యాతిని తెచ్చింది. మొదట్లో ప్రభుత్వం సహాయం చేయలేదు. చివరికి కాంగ్రెసును ఒప్పించాడు. బాల్టిమోర్ నుండి వాషింగ్టన్ వరకు 40 మైళ్ళు టెలిగ్రాఫ్ లైన్ వేశాడు. 1843, మే 23న మొదటిసారిగా సమాచారాన్ని 40 మైళ్ళ దూరానికి సెకన్లలో పంపాడు. అద్భుతం ఆవిష్కరింపబడింది. ప్రపంచం మోర్స్ ప్రతిభకు జేజేలు పలికింది. 1845 ఏప్రిల్ 1 నుండి టెలిగ్రాఫ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.

విద్యుదయస్కాంతం ఆధారంగా తీగల సహాయంతో దూరాన్ని చెరపిన మోర్స్ 1872, ఏప్రిల్ 2న న్యూయార్క్ లో మరణించారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved