22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

3G టెలికాం సేవలు

ఈ ఆర్టికల్ స్పెక్ట్రం ఎలకేషన్ నుండి తీసుకోబడినది..పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు

నిజానికి ఎక్కువ కాల్స్‌ని, మరింత సమాచార వేగాన్ని పెంచడం అనేవి అదనపు స్పెక్ట్రం యొక్క లభ్యత మీదే కాకుండా, అనేక మిగిలిన సాంకేతిక కారణాల పైనకూడా ఆధార పడతాయి. అలాంటి కారణాల వల్ల, కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంటే, International Telecommunication Union (ITU) వారు "IMT -2000" అని అంతర్జాతీయంగా మొబైల్ టెక్నాలజీలకి ఓ స్టాండర్డ్స్‌ని ప్రతిపాదించింది. దాని ద్వారా నాణ్యతని, వేగాన్ని, ఎక్కువ కాల్స్‌ని, ఎక్కువ సమాచార ప్రసారాన్ని సాధించగలుగుతాం. ఈ స్టాండర్డ్స్ నే 3G - అంటే "థర్డ్ జెనెరేషన్" మొబైల్ టెక్నాలజీగా వ్యవహరిస్తున్నాం. వాటిని సాధించడానికి అధిక బాండ్‌విడ్త్ కావాలి. అంటే, 3G సేవలు అందించ దలచుకున్న కంపెనీలు, హైయ్యర్ ఫ్రీక్వెన్సీలపైన లైసెన్సు సంపాదించుకోవాలి.

ఐతే, ఈ 2G ఫోనులతో 3G స్పెక్ట్రమ్ లో వాడే హైయ్యర్ ఫ్రీక్వెన్సీలకి పనికిరావు. అలాగే, టెలికాం కంపెనీలు కూడా వాటి నెట్వర్కుల్లో భారీ సాంకేతిక మార్పులు తెచ్చుకోవాలి. అందుకనే, ఎక్కువ శాతం 3G ఫోనులు, 2G నెట్వర్కలపైన కూడా పనిచేసే విధంగానే తయారు చేస్తున్నారు. 3G కి హైయ్యర్ ఫ్రీక్వెన్సీలు ఎందుకు కావాల్సి వచ్చేయో రెండు కారణాలు చెప్పుకుందాం :

  • అ. ముందు చెప్పుకున్నట్టు, లోయర్ ఫ్రీక్వెన్సీలో పెరుగుతున్న వినియోగదారుల వల్ల, డిమాండ్ ఎలాగూ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని, అ బ్యాండ్లలో హౌస్ ఫుల్లైపోతోంది..
  • ఆ. హైయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ దొరుకుతుంది. ఇది ఎందుకో చూద్దాం:

900Mhz పైన, ప్రతి 10Mhz ని ఓ బ్యాండుగా తీసుకుంటే, మొత్తం 18 చానెల్సు వస్తాయి. అంటే - 895 to 905, 905 to 915, అలా 900Mhz పైన +/-10% రేంజిలో 810 Mhz నుంచి,990 Mhz వరకు 18 ఛానెల్సు వస్తాయి. అదే 3000Mhz పైన, 2700Mhz - 3300Mhz మధ్యలో, 10Mz- విడ్త్‌తో ఓ 60 చానెల్స్ వస్తాయి.

చాలా దేశాల్లోని 3G నెట్వర్కులు, 2Gలు వాడుకునే ఫ్రీక్వెన్సీలను వాడుకోవటం లేదు. అందుకని ఆపరేటర్లు 3G కోసం విడిగా నెట్వర్కును స్థాపించుకుంటున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా ఆదాయం కోసం వీటీకి విడిగా లైసన్సులిస్తున్నాయి. ఒక్క అమెరికాలో మాత్రం, 3G సేవలు, మిగిలిన సేవలూ - అన్నీ ఒకే ఫ్రీక్వెన్సీలలో నడుస్తున్నాయి. విడివిడిగా ఉండటం వల్ల, 3G సేవలు మాత్రమే అందించటం కష్టసాధ్యమైన టెల్కోలకు, 2G నెట్వర్కులు కూడా అవసరం ఔతాయి.

ఇతర విషయాలు:


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved