22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

2G టెలికాం సేవలు

ఈ ఆర్టికల్ స్పెక్ట్రం ఎలకేషన్ నుండి తీసుకోబడినది..పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు

ఈ ఫ్రీక్వెన్సీలను ఎలా వాడుకోగలం, ఎలా గరిష్టస్థాయిలో సమాచారాన్ని ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రసారం చేయగలం (లేదా ఎలా మోసుకుపోగలం) అన్న విషయంలో ఉండే అనేక సాంకేతిక విధానల వల్ల, నాణ్యత పరమైన అంశాలవల్ల - రకరకల "స్టాండర్డ్స్" ఏర్పడ్డాయి. వీటివల్లే మనకి GSM మరియు CDMA అనే రెండు రకాల టెలికాం ఆపరేటర్లు వచ్చారు. అందుకని, 2G గురించో, 3G గురించో తెలుసుకునేటప్పుడు, ముందు ఈ రెండు పేర్లు కూడా చెప్పుకోవాలి.

మొదట్లో "2G టెలికాం సేవలు" అనే పదం లేదు. 3G సేవలు గురించిన మాట వచ్చేక, ఇప్పడు మనం వాడుతున్న టెలికాం సేవలకి "2G" అని, అంతకు ముందు వాడిని రేడియో- వైర్‌లెస్ టెక్నాలజీని 1G అని నామకరణం చేశారు. ప్రస్తుతానికి 2G సేవలలో GSM మరియు CDMA ఆపరేటర్లు ఉండగా - GSM ఆపరేటర్లకి ఒక్కొక్కళ్ళకి 6.2Mhz - 900Mhz, మరియు 1800Mhz ల పైన ఇచ్చారు. CDMA వాళ్లకేమో 900Mhz పైన 5Mhz చొప్పున ఇచ్చారు.(CDMAలో రెండు ఫ్రీక్వెన్సీలు వాడరు)

ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ/హెర్జ్ మీద, కొన్ని పరిమితమైన కాల్స్‌ని మాత్రమే మోసుకెళ్ళగలం. ఒక టెలికాం కంపెనీకి, విపరీతంగా కస్టమర్లు పెరిగి, ఎక్కువ కాల్స్‌ మోసుకెళ్ళాల్సి వస్తే, ఆ కంపెనీకి ఎక్కువ "స్పెక్ట్రం" కావాలన్నమాట. అందుకనే, మెట్రోలలో అదనంగా "స్పెక్ట్రం" ఇవ్వమని ఈ టెలికాం కంపెనీలు (టెల్కో-లు) గోల చేస్తున్నాయి. అయితే ఇన్నాక చెప్పుకున్నట్టు, పరిమితమైన ఈ స్పెక్ట్రమ్‌లో, 100Mhz లో, 37 Mhz ని మాత్రమే ప్రభుత్వం వేలంపాటలో అమ్మింది. మిగిలినది ఇంకా ప్రభుత్వం దగ్గరే ఉంది. అంటే, డిఫెన్సు వాళ్ళ నుంచి కొంత తీసుకొచ్చి, టెలికాం కంపెనీలకి ఇవ్వాలి. అందుకనే ప్రభుత్వం అదనంగా స్పెక్ట్రమ్ ఇవ్వకుండా, టెల్కోలని టవర్లు పెంచమని, మరింతగా దేశంలో టెలికాం పెనెట్రేషన్/ వ్యాప్తిని పెంచండి అని చెప్పుకొచ్చింది. ఓ విధంగా అది మంచిదే. పరిమితమైన ఆస్థిని అంత తొందరగా అమ్మేయకూడదు. అవి ఆర్ధిక శాస్త్రంలో ఉన్న విశేషాలు.

ఇతర విషయాలు:


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved