19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వ్యవసోయోత్పత్తిలో వృద్ధికై

విత్తనోత్పత్తిని ఎలా పెంచాలి, పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా నాణ్యమైన విత్తనాలనూ, కరువు పరిస్థితులను తట్టుకునే (డ్రాట్- రెసిస్టెంటు) వంగడాలను ఎలా అభివృద్ది చేయాలి, సాంకేతక నైపుణ్యం ఎలా పెంచాలి, వాటినెలా అమలు చేయాలి అన్న విషయాల పై పరిశీలించమని "స్టేట్ ఫార్మ్ కార్పరేషన్ ఆఫ్ ఇండియా "(SFCI) ని వ్యవసాయ శాఖ కోరింది.

వివిధ రాష్ట్రాల సాగు పద్ధతులను పునఃసమీక్షంచుకోవడంపై కూడా వ్యవసాయ మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. దేశ ధాన్యాగారాలైన పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో రైతులు నత్రజని యూరియాని అధికంగా వాడుతున్నారని, దీని వల్ల భూమిలో NPK ( నైట్రోజెన్, ఫాస్ఫరస్, పొటాషియం) నిష్పత్తి దెబ్బతిని, సారవంతమైన నేల దెబ్బతింటున్న విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్ (ఇంటరిమ్ బడ్జెట్టు)లో కేటాయించిన అధిక యూరియా సబ్సిడీ (రూ 16,400 కోట్లు) వల్ల, రైతులు అధిక యూరియా వాడకానికి పాల్పడుతున్నట్టు భావించి, ఈ నత్రజని ఎరువుల సబ్సిడీ పై కోత విధించే ప్రతిపాదననూ ఆలోచిస్తున్నారు.

నీటి వాడకం

ఇదిలా ఉండగా, ఉపరితల నీటి వనరులలో వ్యవసాయంకి వాడే నీటి శాతం పడిపోవటం ఓ ఆసక్తికరమైన విషయంగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. "ఖచ్చితమైన అంచనాలు లేవు గానీ, హరిత విప్లవం తదనంతరం కాలంలో , 1970తరువాతి దశాబ్దాలలో, పంట దిగుబడులు పెరిగాయి. ఆ సమయంలో, అందుబాటులోని ఉపరితల నీటి వనరులలో 80% వ్యవసాయానికే ఉపయోగించారు. ఇప్పుడు వరి, గోధుమ, చెరకు దిగుబడులు ఓ స్థాయిలో నిలిచిపోతుండాగా, ఆ నీటివనరులలో 70% మాత్రమే వ్యవసాయానికై వెళ్తున్నాయి. మిగిలిన భాగం పరిశ్రమలు వాడుకుంటున్నాయి." అని అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ లోప్రాజెక్టు డైరెక్టరు శ్రీ టిబియస్ రాజ్‌పుట్ తెలియజేస్తున్నారు.ఇంకా


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved