19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వ్యవసాయం - ఆహార భద్రత

వర్షాభావ పరిస్థితుల ప్రభావం

ఒకవేళ మాన్సూను కాలంలో వర్షపాతం తగ్గితే, ఆహార భద్రతను సమకూర్చే కార్యకలాపాలు కుంటుపడవచ్చు. అప్పడు నిరుపేదలకు ఆహారం ఎలా అందించగలం అనేది అసలు సమస్య. పైగా, యూపీఏ ప్రభుత్వం ప్రజలందరికీ ఆహార భద్రత విషయమై ఒక చట్టం తెచ్చే ఉద్దేశ్యంలో ఉన్న తరుణమిది. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా, దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి, కిలో మూడు రూపాయలకే, నెలకు 25 కిలోల బియ్యం గానీ,గోధుమలు గానీ అందించే విధంగా ఓ కొత్త చట్టం తేవాలన్నది ముఖ్య యోచన. అందుకని, మన వ్యవసాయం వర్షాల మీద తక్కువగా ఆధారపడే విధంగా మార్చాలని మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తోంది. "ఈ ఆహార భద్రత కార్యక్రమాలలో విజయం సాధించాలంటే, వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చాలి " అంన్నారు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి. "వ్యవసాయోత్పత్తి పెరగకపోతే, ఫ్రభుత్వం ఖచ్చితంగా మాట నిలబెట్టుకోలేదు" అనేది ఆయన వాదం. అందుచేత ఓ అగ్రికల్చరల్ స్టిమ్యులస్ ప్యాకేజి (వ్యవసాయ ఉద్దీపన)కోసం, మంత్రిత్వ శాఖ కోరాలనేది ఆయన చెప్పే మాట.

అందుకనే, ఈ వాతావరణ సూచనల ద్రుష్ట్యా ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలను సమాయుత్తపరుస్తోంది. ప్రాంతాలవారీగా పునః సమీక్షించి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో సంప్రదించి, రైతులకు సరియైన సమయంలో సలహానందించవలసిందింగా, రాష్ట్ర "వెదర్ వాచ్ గ్రూపులను" వ్యవసాయ శాఖ, గురువారం జరిగిన సమావేశంలో కోరింది. పంటల పరిస్థితులపై మీడియా సహాయంతో సమాచారం అందించాలనీ కోరింది. ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ - ఫోను నంబరును ఏర్పరచాలని, తద్వారా వివిధ పరిస్థితులకు అనుగుణంగా, తమ తమ రాష్ట్ర రైతులకి ప్రత్యామ్నాయ వ్యవసాయ సూచనలను/ సాగు పద్ధతులను తెలియజేయాలని కోరింది. అగ్రికల్చర్ టెక్నాలజీ మ్యానేజ్‌మెంటు ఏజెన్సీ నుంచి, కావల్సిన ఆర్ధిక వనరులు అందిచవచ్చని తెలిపింది.ఇంకా


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved