19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

గుప్తుల కాలం-చిత్రలేఖనం

గుప్తులకాలంలో చిత్రలేఖనం, సంపూర్ణతను సంతరించుకొందని డా।। వి.ఎస్ అగర్వాల్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అజంతా గుహల, మధ్యప్రదేశ్ లెని గ్వాలియర్కు సమీపంలోని బాగ్ గుహల గోడలమీద గుప్తుల చిత్రలేఖనాలకు సంబంధించిన అతి ముఖ్యమైన ఉదాహరణలు కనిపిస్తాయి. గుప్తులకాలంలోని చిత్రకారులు బుద్ధిడి జీవితంలోని సంఘటనలనూ, లౌకికదృశ్యాలనూ చిత్రించారు. 17వ గుహలో బుద్ధుడి జనన మరణాలను చిత్రించే చిత్రాలున్నాయి. 16వ గుహలో మరణిస్తున్న యువరాణిని చూపుతున్న అద్భుతమైన చిత్రం ఉంది. కళావిమర్శకుల అభిప్రాయంలో, గుప్తులకాలంనాటి చిత్రలేఖనంలో రేఖల సౌకుమార్యం, వర్ణాల విశిష్టత, అపూర్వమైన భావ వ్య్తీకరణ ద్యోతకమవుతాయి.

ఇంకా


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved