19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శాస్త్రీయయుగం

గుప్తుల కాలం

వివిధ జీవన విధానాలలో ఉన్నతిని సాధించడం జరిగింది కాబట్టి కొంతమంది చరిత్రకారులు, గుప్తులకాలాన్ని స్వర్ణయుగమని పేర్కొంటారు. అయితే సాధారణంగా శూద్రుల ప్రత్యేకంగా దళితుల జీవన పరిస్థితులు చాలా హీనంగా ఉండటంతోపాటు బలహీనమైన, క్రూరమైన భూస్వామ్య రాజకీయ వ్యవస్థకు ఈ కాలంలోనే నిర్దిష్టరూపం ఏర్పడింది. కాబట్టి ఈ కాలానిన స్వర్ణయుగంగా పేర్కొనకూడదని మరికొందరు చరిత్రకారులు పేర్కొంటారు. అయితే, సంస్కృత సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, వైద్యం, శస్త్ర చికిత్స, తత్వశాస్త్రం వంటి వివిధ రంగాలకు ఉన్నత ప్రమాణాలను సాధించడం జరిగింది కాబట్టి ఈ యుగాన్ని శాస్త్రీయయుగంగా పేర్కొనవచ్చునని వీరు పేర్కొంటారు.

కాళిదాసు , విష్ణుశర్మ , అమరసింహుడు మొదలయినటువంటి ప్రముఖ సాహితీమూర్తులు ఈ యుగానికి చెందినవారే కాబట్టి గుప్తులయుగాన్ని సంప్రదాయ సంస్కృత సాహిత్య యుగంగా పేర్కొంటారు. మొదటి కుమారుగుప్తుడు పోషించిన నలందా విశ్వవిద్యాలయం విద్యావ్యాప్తికోసం ఎంతగానో తోడ్పడింది.

గుప్తుల యుగం అపూర్వమైన కళా కార్యకలాపానికి ప్రసిద్ధిగాంచింది. శిల్పం, చిత్రలేఖనం, టెర్రాకోటాకళ అద్భుతమైన ప్రగతి సాధించాయి. గుహవాస్తు శిల్పం మరింత అభివృద్ధి చెందింది. ఈ కాలంలో రాతి ఆలయాలూ, గర్భగృహ భావన అవతరించాయి.

గుప్తుల నాటి కళలో నిరాడంబరమైన వ్యక్తీకరణ, ఆధ్యాత్మిక ప్రయోజనం కలగలిసి ఉన్నాయి. ఇది అంతకుపూర్వకాలంలోని ప్రకృతివాదానికీ మధ్యయుగ కళకు చెందిన ప్రతీకవాదానికీ మధ్యేమార్గంగా ఉంది. వస్త్రాలు, ఆభరణాలు, ఇతర అలంకరణ సామాగ్రిని వాడటంలో గాంభీర్యం ఉట్టిపడి ఉంది. ఇది అన్నివిధాలుగా భారతీయ కళాస్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.

మతం

మతపరంగా విగ్రహారాధన ప్రాచుర్యంలోకి వచ్చింది. బలుల స్థానంలో పూజలకు ప్రాముఖ్యం పెరిగింది. లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరు, సరస్వతీ బ్రహ్మలు అని దేవుళ్ళను వారి భార్యలతోపాటు పూజించడం జరిగింది. హిందువులు, వైష్ణవులనీ, శైవులనీ రెండు శాఖలుగా విడిపోయారు. హిందూ ఆరాధన మీద తాంత్రిక విశ్వాసాల ప్రభావం, శక్తిమత శాఖల ఆవిర్భావానికి దారితీసింది.

తత్త్వశాస్త్రం

ఈ కాలంలో ఆయా హిందూ తాత్విక వ్యవస్థలు అవతరించాయి. ఇవి న్యాయం (విశ్లేషణ), వైశేషికం (ప్రత్యేక లక్షణాలు), సాంఖ్యం (గణన), యోగం, మీమాంస, వేదాంతం.

ఈ కాలంలో మహాభారతంతోపాటు పురాణాలను సవరించడమైనది.

ఇంకా


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved