17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

త్యాగయ్య కృతులలో శ్రీరామ కల్యాణం

By తాతిరాజు, వేణుగోపాల్

తొలి మాసంలో తొలి వెన్నెల, కొత్త చిగురులతో ప్రకృతి, ఎప్పుడూ ఉండే కాకి గోలల మధ్య కోకిల శృతి- ఒక విశేష ఆకర్షణ. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి అష్టమి వరకు సగం మాసంలో మెల్ల మెల్లగా చంద్రుడు వృద్ధి చెందుతూ 'ఆధా హై చంద్రమా' అనిపించుకుంటాడు. ఆ పైన వచ్చే 'నవమి' కి ఒక ప్రత్యేకత ఉంది. అదే శ్రీ రామ నవమి. సాక్షాత్తు శ్రీ రామ చంద్రుని జన్మదినం. సీతారామ కళ్యాణం కూడ ఆ రోజునే కావడం మరో విశేషం.

శ్రీ రామనవమి పండుగ >>>

ఈ సందర్భంగా వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి వారి రెండు కీర్తనలు గుర్తు చేసుకోవడం సముచితం. 'సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే ' అన్న కీర్తనలో ఆయన సీతనూ,రాముణ్ణీ వేరు వేరుగా పేర్కొన్నా ఇందులో ఒక వైచిత్రి ఉంది. ఆరు చరణాలలో 24 రకాలుగా రాముణ్ణి అభివర్ణిస్తూ చివరిగా 'త్యాగరాజ నుత' అన్నారు. ఇవే 24 గంటలై ఒక దినమయితే, అది ' సీతనూ,రాముణ్ణీ' కలిపిన 'పెళ్ళి రోజు' . అంతటి మహనీయుని కళ్యాణ వీక్షణం నిజంగానే వైభోగమే.

ఇక రెండవ కీర్తన - బంటు రీతి కొలువు ఈ 'విరోధి' నామ సంవత్సరానికి అన్వయించ తగ్గది. ఈ కీర్తనలో త్యాగయ్య ఒక చిన్న కోరిక, అంటే శ్రీ రామ కొలువులో తానొక భటుడైతే చాలు అన్నది, కోరుతున్నట్లున్నా నిజానికి అది మనందరిలో ఉన్న కోరిక అని చెప్పవచ్చు. మన విరోధులు మన మనసులో ఉన్న 'అంతశ్శత్రువులు' అనదగ్గ కామం,క్రోధం మొదలైనవే. వీటిని నిరోధించాలంటే ఒక భటునికున్నంత శక్తి కావాలి. కంచుకం, ఖడ్గం, ముద్ర బిళ్ళ ఇవీ ఉండాలి. అవి ఏవో కావు-రామ స్మరణతో కలిగే పులకింత, రామ నామం, రామ భక్తీ - అని త్యాగరాజ స్వామి వారు మనల్ని జాగృతం చేస్తున్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved