17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీ విరోధి నామ సంవత్సరం- పంచాంగం -

నాయకులు - ఉపనాయకులు

 1. రాజు - శుక్రుడు
 2. మంత్రి - కుజుడు
 3. సేనాధిపతి - రవి
 4. సస్యాధిపతి - గురుడు
 5. ధాన్యాధిపతి - బుధుడు
 6. అర్ఘాధిపతి - చంద్రుడు
 7. మేఘాధిపతి - చంద్రుడు
 8. రసాధిపతి - శని
 9. నీరసాధిపతి - గురుడు
 10. పురోహితుడు - గురుడు
 11. పరీక్షకుడు-బుధుడు
 12. గణకుడు- శని
 13. గ్రామపాలకుడు - చంద్రుడు
 14. దైవజ్ఞుడు - రవి
 15. రాష్ట్రాధిపతి - శుక్రుడు
 16. సర్వదేశోద్యోగపతి - కుజుడు
 17. అశ్వాధిపతి - కుజుడు
 18. గజాధిపతి - గురుడు
 19. పశునాం అధిపతి - చంద్రుడు
 20. దేశాధిపతి - గురుడు
 21. నరాధిపతి - రవి
 22. గ్రామపాలకుడు - బుధుడు
 23. వస్త్రాధిపతి - శని
 24. రత్నాధిపతి - చంద్రుడు
 25. వృక్షాధిపతి - బుధుడు
 26. జంగమాధిపతి - గురుడు
 27. సర్పాధిపతి - శని
 28. మృగాధిపతి - రవి
 29. శుభాధిపతి - శుక్రుడు
 30. స్త్రీణామాధిపతి - చంద్రుడు

సావన వర్షాధిపతి - కుజుడు

పశుపాలకడు, గోష్టప్రాపకడు, గోష్టభహిష్కర్త - శ్రీకృష్ణుడు

(ఈ నాలుగు, ముందు చెప్పిన 30 మరియు ఆఢకాది, మేఘాది నిర్ణయాలతో కలిపి మెత్తం 36 ఆధిపత్యాలు)

నవనాయకులలోను ఆరు(6) ఆధిపత్యములు శుభులకైనవి. ముప్పదిఆరు(36) ఆధిపత్యములందు పందొంమ్మిది(19) ఆధిపత్యములు శుభులకైనవి.

రాజు శుక్రుడైన ఫలముశ్లో|| సమృద్ధ సస్యా వసుధాతివృష్టి ర్గావోహి సంపూర్ణ పయః ప్రదాస్స్యుః

స్త్రియః ప్రియాణాం జనయంతితోషం కామోపచారైః ర్భృగుజేబ్దనాథే||

సంవత్సరాధిపతి శుక్రుడగుటచే భూమిఅంతయు సమృద్ధియైన సస్యములతోనూ, చక్కనైన వర్షములతోనూ ,పాడితోనూ కూడి స్త్రీ పురుషులు అన్యోన్యము, అనురాగము కలిగి ఉంటారు.

మంత్రి కుజుడైన ఫలము

శ్లో|| పురగ్రామ వనాదీని దహ్యంతే వహ్నినాభృశం

వృష్టిర్మధ్యా భవేద్యుద్ధం మంత్రిణ్య వనిజేసతి||

కుజుడు మంత్రి అగుటచే వర్షములు మధ్యమముగా కురియును. గ్రామములు పట్టణములు అరణ్యములు దహించబడుచుండును. యుద్ధభయం ఉండగలదు.

సేనాధిపతి రవిఅయిన ఫలంశ్లో|| అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణాం - అల్పాంబుదావారిధరాస్సవాతాః

రక్తానిసస్యాని ఫలంతి భూమై - సేనాధిపత్యేదివసేశ్వరస్య

సేనాధిపతి రవి అగుటచే ప్రభువులు అన్యోన్యము వైరమును పొందియుండి మేఘములు స్వల్పముగా వర్షించును. ఎర్రని ధాన్యజాతులు పుష్కలముగా ఫలించగలవు

సస్యాధిపతి గురుడైన ఫలము

శ్లో|| భవంతి గావా స్సుదుఘాః ఫలితావృక్షజాతయః

నీతియుక్తా స్సదా భూపా జీవే సస్యాధిపేసతి||

సస్యాధిపతి గురుడగుటచే పశువులు చక్కని పాలనివ్వగలవు. మామిడి మున్నగు వృక్షజాతులు సమృద్ధిగా ఫలించగలవు. పాలకులెల్లరూ నీతియుతులై ఉండగలరు

ధాన్యాధిపతి భుదుడైన ఫలము

శ్లో|| సూక్ష్మధాన్యఫలం స్వల్పం వర్షం స్యాత్ఖండమండలే|

మధ్య సస్యాని జాయంతే బుధే ధాన్యాధిపేసతి||

బుధుడు ధాన్యాధిపతి అగుటచే సూక్ష్మ ధాన్య జాతులు స్వల్పముగా ఫలించును. వర్షములు ఖండ ఖండములుగా కురియగలవు. సస్యములు మధ్యమముగా ఫలించును.

అర్ఘాధిపతి చంద్రుడైన ఫలము

శ్లో|| సువృష్టి సర్వ సస్యానమభివృద్ధిః ప్రజాయతే |

మహతీ చార్ఘవృద్ధిస్స్యా చంద్రే ర్ఘాధిపేసతి||

అర్ఘాధిపతి చంద్రుడు అగుటచే సమస్తమైన సస్యములకు అనుకూలమైన వర్షములు కురియగలవు. సమస్తవస్తువులకు ధరలు తగ్గినట్లు ఉండి అభివృద్ధికరమగును.

మేఘాధిపతి చంద్రుడైన ఫలము

శ్లో|| సువృష్టీ స్సర్వసస్యానాం ఫలితాధాన్యజాతయః

బహుక్షీర ప్రదాగావో మేఘాదీశే నిశాకరే ||

మేఘాధిపతి చంద్రుడగుటచే అన్నిరకములైన సస్యములకు అనుకూలమైన వర్షములు కురిసి సమృద్ధియైన పంటలను ఇవ్వగలవు. పశువులు పుష్కలముగా పాలనిచ్చును.

రసాధిపతి శని అయిన ఫలము

శ్లో|| తిలమాష కుళుత్థాధి కృష్ణధాన్యాని యాని చ

కృష్ణ భూమి స్సుఫలితా మందే యది రసాధిపే ||

రసాధిపతి శని అగుటవలన నువ్వులు, ఉలవలు, మినుములు మొదలగు నల్లని ధాన్యములు, నల్లని భూములు ఎక్కువగా ఫలించగలవు.

నీరసాధిపతి గురుడైన ఫలము

శ్లో|| హరిద్రా పీతవర్ణనాం వస్త్రాదీనాం తదైవ చ

నీరసాధిపతౌ జీవే సదావిద్ధిః ప్రజాయతే ||

గురుడు నీరసాధిపతి అగుటచే బంగారము నారవస్త్రములు ధాన్యము మున్నగునవి వృద్ధిని పొందగలవు. ప్రజలందరూ అభివృద్ధిని పొందగలరు.

పురోహితుడు మున్నగువారి ఫలములు ఆయా అధిపతులు క్రూరులైన క్రూరఫలమును, శుభులైన శుభఫలమును ఇత్తురు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved