19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీ విరోధి నామ సంవత్సరం- పంచాంగం

అసలు ఉగాది అంటే?

పంచాంగం 2009-2010

(పఞ్చాఙ్గమ్ అని రాయాలి.. కానీ...మనం మారిపోయాంకదా...అందుకని "పంచాంగం" కూడా మారింది! ... ఇక ముందుకు..)

వివిధ కొలమానాల(క్యాలెండర్స్)లోఈ సంవత్సరం:

  • కలి ఆదిగా ఈ సంవత్సరం: 5110
  • ఫసలీ సంవత్సరం: 1417-18
  • క్రీస్తు శకం: 2009-10
  • శాలివాహన శకం: 1931
  • హిజరీ సంవత్సరం: 1430-31
  • భారత స్వాతంత్ర్య శకం: 62-63

ఆంధ్ర దేశంలో సౌర చాంద్రములు కలసిన అమాంత చాంద్రమానము లోక వ్యవహారమున ఉపయోగించబడుతోంది. వింధ్యకు ఉత్తరాన బార్హస్పత్యమానము వ్యవహారములో ఉన్నది. శ్రీపతి అను గ్రంధకర్త"ప్రభవ" నుండి "క్షయ" వరకు చెప్పిన అరవై (60) సంవత్సరాలలో ఇది విరోధినామ సంవత్సరము(క్రమములో ఇది 23వ సంవత్సరం). ఈ అరవై సంవత్సరాలలోనూ ప్రతి ఐదేళ్ళ కాలాన్ని ఒక 'యుగం' మంటారు. ఈ ఐదేళ్ళూ వరసగా సంవత్సర, పరివత్సర, ఇడావత్సర,అనువత్సర,ఇడ్వత్సర అని పిలవబడుతున్నాయి. కాబట్టి ఈ విరోధి నామ సంవత్సరం- ఇడావత్సరం. ఈ పంచమ యుగానికి అధిపతి-ప్రజాపతి, ఇడావత్సరానికి అధిపతి-చంద్రుడు. ఇడావత్సరంలో వర్ష ఋతువు ప్రారంభంలోనూ, ఆఖరులోనూ ఎక్కువ వాన కురుస్తుందని వేదాంగ జ్యోతిషంలో చెప్పారు.

విరోధి, ఆ పైన వచ్చే వికృత, ఖర ఈ మూడూ విపత్తును సూచించేవిగా వరాహమి హిరుడు 'బృహత్ సంహిత'లో పేర్కొన్నాడు.

బార్హస్పత్యమానముచే శుభకృత్ నామ సంవత్సరము. ఈ 60 సంవత్సరాలూ గ్రహాల్లో అతి పెద్దదీ బరువైనదీ అయిన బృహస్పతి/గురు గ్రహానికి సంబంధించినవే. విరోధి కాక శుభకృత్ కావడానికి కారణం క్రీ.శ 907 కు పూర్వం ఉత్తర,దక్షిణ భారత దేశంలో ప్రతి 85 లేక 86 ఏళ్ళకొకసారి ఒక సంవత్సరాన్ని మిన హాయిస్తుండగా, 907 నుంచి దక్షిణ భారత దేశంలో మానేసారు. ఈ లెక్కన 2012లో ఉత్తరాదిని ఒక నామ సంవత్సరం తప్పుకో వచ్చు.

సూర్యుడు ఉండే నక్షత్రంలోనే గురు గ్రహం ఉదయిస్తే అదే గురూదయం. ఆ సంవత్సరాన్ని (అంటే అబ్దాన్ని) గురూదయాబ్దం అంటారు. ఈ ఏడాది ఇది శ్రవణ నక్షత్రంలో జరుగుతోంది. కావున"శ్రావణాబ్ద"మని పేరు.

(మన రాష్ట్రంలోనితెలుగువారికి ఇది విరోధినామ సంవత్సరం)

ఈ ఆర్టికల్‌కై శ్రీ తాతిరాజు వేణుగోపాల్ గారు కొంత సమాచారాన్ని అందించారు..వారికి మా ధన్యవాదాలు.

వారి ఇతర రచనలు

త్యాగయ్య కృతులలో శ్రీరామ కల్యాణం

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved