19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు సినిమా "జయసింహుడు" - కాంతారావు

By కె, శర్మ

కొంతకాలంగా క్యాన్సర్‌తో భాధపడుతున్న కాంతారవు మార్చి 22, 2009 సాయంత్రం హైదరాబాద్ సోమాజీగూడాలోని యశోదా ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు.ఆయకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

56ఏళ్ళ సినీ ప్రస్థానంలో 300కు పైగా చిత్రాలలో ప్రేక్షకులను అలరించిన కాంతారావు 1923 నవంబరు 16న నల్గొండ జిల్లా కోదాడ మండలం గుడిబండలో జన్మించారు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు . 1951లో వచ్చిన నిర్దోషి చిత్రంతో ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు. 1952లో ప్రతిజ్ఞ చిత్రంలో ఆయన మెదటి సారి హీరో వేషం కట్టారు.(1950లో వివాహం చేసుకున్న ఆయన ఈ చిత్రంలోని కథానాయకుని పేరు "ప్రతాప్"నే తన మొదటి కుమారునికీ పెట్టుకున్నారు!) జానపద చిత్రాలలో తన ట్రేడ్‌మార్క్ కత్తియుద్ధాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.

సాంఘిక, జానపద, పౌరాణికాలలో ఆయన తనదైన శైలిలో గుర్తింపు పొందారు. కథానాయకునిగా, ప్రతినాయకునిగా, రెండో హీరోగా కూడా ఎన్నో పాత్రలను ఆయన పోషించారు. పౌరాణిక చిత్రాలలో నారదునిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

తెలంగాణా నుండి వచ్చిన నటులలో ఎన్టీఆర్ స్థాయిలో ప్రజా గుర్తింపు పొందిన ఏకైక నటుడు కాంతారావు. వారిరువురి మధ్య ఎంతో స్నేహం ఉండేది. కంచుకోట , ఏకవీర , లవకుశ , పాండవ వనవాసం ఇలా 50 చిత్రాలలో వారు కలసి నటించారు. లవకుశ చిత్రంలో లక్ష్మణుని పాత్రకు వేరొకరిని ఎంపిక చేయగా ఎన్టీఆర్ పట్టుపట్టి కాంతారావుకు ఆ పాత్రను ఇప్పించారని చెబుతారు. తాను శ్రీకృష్ణుని పాత్ర వేయలేని సినిమాలలో కాంతారావునే ఎన్టీఆర్ ఆ పాత్రకు ఎంపిక చేసేవారు.

లవకుశలోని లక్ష్మణుని పాత్రకుగాను ఆయనకు జాతీయ అవార్డు లభించింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకుగాను రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు తో సత్కరించింది.

నటునిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయనప్రేమ జీవులు చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. మొత్తం నాలుగు చిత్రాలను ఆయన నిర్మించారు. అయితే నిర్మాతగా ఆయన రాణించలేకపోయారు. ఆర్ధికంగా చాలా నష్టపోయారు. నటునిగా మద్రాసులో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఆయన తన చివరి రోజుల్లో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కేవలం రెండు గదుల ఇంట్లో నివసించవలసిన పరిస్థితి ఏర్పడింది.

నటునిగా ఆయన ఆఖరి చిత్రం పాండురంగడు.

ఇతర చిత్రాలు

 • జయసింహ
 • పాండురంగ మహత్యం
 • కంచుకోట
 • ఏకవీర
 • లవకుశ
 • పాండవ వనవాసం
 • నర్తనశాల
 • సీతారామ కళ్యాణం
 • పాదుకా పట్టాభిషేకం
 • ముత్యాల ముగ్గు
 • రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్
 • విజేత
 • దేవదాసు(కృష్ణతో)
 • ఇల్లాలు(శోభన్ బాబుతో)

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved