22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వృక్షోరక్షతి రక్షితః

మార్చి 21 - ప్రపంచ అటవీ దినోత్సవం

Trees are poems that earth writes upon the sky.

We fell them down and turn them into paper,

that we may record our emptiness

(చెట్లు మన పుడమితల్లి ఆకాశంపై రాసిన కవితలు..

మనం వాటిని నరికి కాగితాలుగా మలుస్తున్నాం...

మన డొల్ల జీవితాలను రచించుకోవడానికి)

- Kahlil Gibran(ఖలీల్ జిబ్రాన్)ఎవరో అన్నారు:

We can raise a plantation, but never a forest

అందులో ఎంతో నిజం వుంది.మన భారత దేశం ప్రపంచంలో అగ్రగామి కావాలని మనం అందరం కోరుకుంటాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ పోటీ ప్రపంచంలో నేడు అందరూ మాట్లాడుకునే రెండు అతి పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్, చైనాలు. మనం చైనాని అధిగమించాలని ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఈ పరుగుపందెంలో ఒక విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాలి. చైనావారి ప్రగతికి వారి పర్యావరణం మూల్యం చెల్లించుకుంటోంది. మనం కూడా అదే విధంగా నష్టపోకుండా చూసుకోవలసిన బాధ్యత మనది. అటువంటి అభివృద్ధి జీవితంలోని అసలైన ఆనందాలని మనకు దూరం చేస్తుందని గ్రహించాలి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved