19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

న్యాయవ్యవస్థ సమస్యలు -కొన్ని పరిష్కార మార్గాలు

By జి, శివ కుమార్

చట్టబద్ధ సంస్థలు, శాసన వ్యవస్థ, రాజ్యాంగ బద్ధ సంస్థలు విధి నిర్వహణలో పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా పనిచేయకపోవడం కేసుల సంఖ్యకు కారణమౌతోంది. పెండింగ్ కేసులకు న్యాయమూర్తుల కొరత కూడా ఒక ప్రధాన కారణం. న్యాయమూర్తుల పదవుల భర్తీలో కూడా పాలకుల నిర్లక్షం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
 • న్యాయవ్యవస్థకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. పొరుగునున్న చైనాను ఇందుకు ఆదర్శంగా తీసుకోవచ్చు.
 • ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెంచాలి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇవి ప్రారంభమయ్యాయి.
 • నాలుగువేల గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇటీవల కేంద్రం చట్టం చేసింది.ఈ చట్టాన్ని త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలి.
 • న్యాయమూర్తుల పదవుల భర్తీని వేగవంతం చేయాలి.
 • అప్పీళ్ళు, వాయిదాల విషయంలో నిర్ణయాత్మక వైఖరీ అవసరం. వీటిని అనుమతించే విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి.
 • రాత్రి పూట న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఈ దిశగా గుజరాత్ ఇప్పటికే ముందంజలో ఉంది.
 • సంచార న్యాయస్థానాల సంఖ్యను పెంచాలి.
 • బ్రిటీష్ కాలంనాటి చట్టాలను సవరించాలి
 • హైకోర్టు బెంచ్‌ల సంఖ్యను మరింతగా పెంచాలి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ హైకోర్టు బెంచ్‌లు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్ట్‌కు బెంచ్‌లు లేవు.
 • సుప్రీంకోర్ట్ బెంచ్‌ల ఏర్పాటు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
 • లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సమర్ధంగా చేపట్టాలి.


ఇంకా

న్యాయవ్య(అ)వస్థ

కొండల్లా కేసులు - కరువైన జడ్జీలు


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved