22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

న్యాయవ్య(అ)వస్థ

By జి, శివ కుమార్

మౌలికవసతులు మృగ్యం

న్యాయవ్యవస్థ - రాజ్యాంగంలోని మూడు ప్రధాన వ్యవస్థల్లో ఒకటి. అలాంటి న్యాయవ్యవస్థ నేడు పాలకులు నిర్లక్షానికి గురౌతోంది.న్యాయపాలికకు బడ్జెట్ కేటాయింపుల్లో "న్యాయం" జరగడంలేదన్నది నిష్టుర సత్యం. న్యాయ వ్యవస్థకు మౌలిక వసతులు కల్పించడంలో విధాన నిర్ణేతలు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారు. న్యాయస్థానాల్లో కనీస వసతులు కొరవడటం పాలకుల నిర్లక్షానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. ఉన్నత న్యాయస్థానాలైన హైకోర్టులు, సుప్రీం కోర్టుల్లో మౌలిక వసతులు కొద్దిగా మెరుగ్గా ఉన్నప్పటికి జిల్లా కోర్టులు సబార్డినేట్ కోర్టుల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. విరిగిన కుర్చీలు, గరగరమని తిరిగే ఫ్యాన్ల కింద న్యాయవాదులు, న్యాయమూర్తులు, సిబ్బంది, విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. వ్యాజ్యాలు, విచారణకు అనువైన పరిస్థితులు న్యాయస్థానాల్లో లేవనడం అతిశయోక్తి కాదు. కొన్ని చోట్ల సాక్షులు, కక్షీదారులు, న్యాయస్థానాల ఆవరణలోని చెట్ల కింద సేద తీరాల్సి వస్తోంది. నేటికీ పలుచోట్ల మన కోర్టులు పెచ్చులూడిపోయిన, బ్రిటీష్ హయాంలో నిర్మితమైన భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో న్యాయస్థానాలు అద్దె భవనాల్లో కాలం వెళ్ళదీస్తున్నాయి.

అరకొర కేటాయింపులతో అవస్థలు

అరకొర కేటాయింపులే అసలు సమస్యకు కారణం. స్థూల జాతీయోత్పత్తిలో(GDP) కనీసం ఒక్క శాతమైనా నిధులు కేటాయించాలని 2008 జూన్‌లో మద్రాసు హైకోర్టు లోక్ అదాలత్ బెంచ్‌ను మధురైలో ప్రారంభించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్ కోరారు. స్వయంగా ప్రధాన న్యాయమూర్తే ఇబ్బందులను ఏకరవు పెట్టారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. న్యాయ వ్యవస్థకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలదీ అదే విధానం. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అవసరాల మేరకు కేటాయింపులు చేయడంలేదు. ఒక్క ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే గుడ్డిలో మెల్లగా 1.3శాతం నిధులు కేటాయించింది. ఈ విషయంలో ఇతర దేశాల్లో పరిస్థితి కొంచం మెరుగ్గా వుంది. సింగపూర్‌లో 1.2శాతం, అమెరికాలో 1.4శాతం, బ్రిటన్‌లో 4.3శాతం నిధులు న్యాయవ్యవస్థకు కేటాయిస్తున్నారు. ఎనిమిదవ ప్రణాళికలో 110కోట్లు, తొమ్మిదవ ప్రణాళికలో 385కోట్లు, పదో ప్రణళికలో 700కోట్లు కేటాయించారు.

న్యాయవ్యవస్థకు చేస్తున్న కేటాయింపులను పరిశీలిస్తే ప్రభుత్వాల ఉదాసీనత మనకు విదితమైతుంది. పదో పంచవర్ష ప్రణాళికలో న్యాయవ్యవస్థకు ప్రణాళికా మెత్తంలో 0.07శాతం అంటే రూ. 700కోట్లు మాత్రమేనని గణాంకాలు ఘోషిస్తున్నాయి. న్యాయపరిపాలన నిర్వహణా వ్యవస్థకు ఈ మెత్తం సరిపోతుందా అని 2008, ఫిబ్రవరి 24న న్యూ ఢిల్లీలో రెండు రోజుల పాటూ జరిగిన న్యాయ సంస్కరణల సదస్సులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భాన్ సూటిగా సర్కార్‌ను ప్రశ్నించారు. ఇదే సదస్సులో భాన్ మాట్లాడుతూ "మాకు న్యాయస్థానాలు ఏర్పాటు చేయండీ, న్యాయమూర్తులను ఇవ్వండి - పెండింగ్ కేసులు లేకుండా చేస్తాం" అని అన్నారు. ప్రతి 10లక్షల మంది ప్రజలకు 50మంది న్యాయమూర్తులు అవసరమని లా కమీషన్ సూచిస్తుండగా, ప్రస్తుతం వారి నిష్పత్తి 10.3 మాత్రమే. ఈ విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం 2008-09 బడ్జెట్‌లో న్యాయవ్యవస్థకు కేటాయింపులను కొంతమేరకు మెరుగు పెంచింది. 2007-08 బడ్జెట్‌లో 108.20కోట్లు కేటాయించగా, 2008-09 బడ్జెట్‌లో ఆమెత్తాన్ని 253.12 కోట్లకు పెంచి -రెట్టింపు చేసింది. కింద స్థాయి న్యాయస్థానాల్లో దాదాపు 2.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్న నేపధ్యంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రూ. 13కోట్లు కేటాయించింది. కేసులను సత్వరం పరిష్కరించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు (Fast Track Courts) 2007-08 కేటాయింపులకన్నా అదనంగా 13శాతం నిధులిచ్చారు. న్యాయవాదుల నుంచి మెరుగైన న్యాయసలహాలు పొందేందుకు 36.52కోట్లు కేటాయించింది. సర్వోన్నత న్యాయస్థానం నిర్వహణ, భద్రత, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల ప్రయాణ ఖర్చులు కోసం రూ.56.74కోట్లను కేటాయించారు. గత ఏడాది కేటాయింపులకన్నా ఈసారి కేటాయింపులు పెంచినప్పటికీ అవసరాల రిత్యా చూస్తే ఈ మెత్తాలు ఏమూలకు రావన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది.ఇంకా

కొండల్లా కేసులు - కరువైన జడ్జీలు

ఇవీ పరిష్కారాలు


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved