22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

జమ్షెడ్జీ టాటా

జమ్షెడ్జీ నుసేర్‌వాన్జీ టాటా - టాటా వ్యాపార కంపెనీలకు మూలపురుషుడు. అంతే కాదు, ఒక పక్క విదేశీ పాలకుల దాస్యశృకంలాలు, మరో పక్క పేదరికంతో సతమతమౌతున్న భారత ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డ వ్యక్తి శ్రీ జమ్షెడ్జీ టాటా.

ఆయన 1839 మార్చి 3వ తేదీన గుజరాత్‌లోని నవ్‌సారీ గ్రామంలో జన్మించారు. తండ్రి నుసేర్‌వాన్జీ టాటా. వారిది పార్శీ పుజారుల కుటుంబం. తొలిచూలు సంతానం. ఒక్కగానొక్క కొడుకూను. 14వ ఏటవరకు స్వగ్రామంలోని పెరిగిన ఆయన తరువాత బొంబాయి తనతండ్రి వద్దకు చేరారు. 1858లో బొంబాయిలోని ఎలిఫెంటైన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ పట్ట పొందారు. ఆరోజుల్లోనే ఆయనకు విద్యపై మక్కువ చదవటంపై ఆసక్తి అలవడ్డాయి. ఆయన జీవితాంతాం ఈ ఇష్టం కొనసాగింది. అయితే, విద్య కన్నా వ్యాపరం వైపే ఆయన జీవితం సాగింది.

వారి కుటుంబలంలో వ్యాపారంలో ప్రవేశించిన మొదటి వ్యక్తి జమ్షేడ్జీ. 1859లో , తన 20వ ఏట , తండ్రి మర్చెంట్‌, బ్యాంకర్‌గా నడుపుతున్న సంస్థలో చేరారు. 1868 నాటికి ఆ వ్యాపారం కాస్తా మూతపడింది. అయితే ఆ అనుభవంతో ఆయన రూ.21, 000 పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు.

అదే సమయంలో ఆయన బ్రిటన్ వెళ్ళారు. అక్కడ లాంకెషైర్‌లో ప్రత్తి వ్యాపార విజయాన్ని చూసిన ఆయన మన దేశంలో కూడా అటువంటి విజయాన్ని సాధించగలన నమ్మకానికి వచ్చారు. 1869నుండి ఆయన వస్త్రరంగంలోకి అడుకుపెట్టారు. బొంబాయి పారిశ్రామిక వాడ చించ్‌పోక్లీ ప్రాంతంలో ఒక మూలబడిన నూనె కర్మాగారాన్ని కొని దానిని అలెగ్జాండ్రా మిల్ల్ పేరుతో ప్రత్తి మిల్లుగా మార్చారు. ప్రత్తి మిల్లుకు పంట పండేప్రాంతానికి దగ్గరలో, సరైన రైలు మార్గాం, చక్కని నీరు, ఇంధన వసతులు గల ప్రాంతమే సరైనదని భావించారు. అప్పట్లో అన్ని కొత్త వ్యాపారాలూ బొంబాయిలోనే మొదలు పెట్టేవారు. ఆ రివాజును మార్చి జమ్షేడ్జీ 1874లో నాగపూర్‌లో రూ1.5 లక్షల పెట్టుబడితో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని స్థాపించారు. భారత దేశాన్ని బ్రిటీషు సామ్రాజ్యంలో విలీనం చేస్తూ బ్రిటీషు రాణీ విక్టోరియాను భారత దేశ మహారాణిగా ప్రకటించిన జనవరి 1, 1877న నాగపూర్‌లో ఎంప్రెస్ మిల్లు ఆవిర్భవించింది.

ఆయన తన పరిశ్రమలలో పనిచేసే కార్మికుల బాగోగులకోసం కూడా ఎంతో ఆరాటపడ్డారు. తక్కువ పనిగంటలు, విశాలమైన, ధారాళంగా గాలీ వెలుతురూ వచ్చే కర్మాగారాలు, కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలను కల్పించారు. అప్పటికి పారిశ్రామికంగా ముందున్న పాశ్చాత్యదేశాలలో కూడా ఇటువంటి వసతుల కల్పన జరగలేదు. అదీ ఆయన ముందుచూపుకు నిదర్శనం.

1880ల నుండి 1904లో మరణించే వరకూ కూడా జమ్షేడ్జీ ముడు కలల సాకారం కోసం ఎంతో శ్రమించారు. భారత దేశంలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని, జలవిద్యుత్ తయారీ జరగాలని, ప్రపంచస్థాయి విద్యాసంస్థల రూపొందాలని ఆయన ఆకాక్షించారు. ఆయన జీవితకాలంలో ఈ మూడు కోరికలు నెరవేరనప్పటికీ ఆయన శ్రమ మరణానంతర కాలంలో ఫలించింది. ఉక్కు కర్మాగార స్థాపనుకు ఆయన ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఎందిరి ఎగతాళులనో భరించాల్సి వచ్చింది. అయినా ఆయన పట్టు విడవలేదు.

అలాగే బెంగుళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్థాపనకు గాను ఎంతో మందిని ఒప్పించారు. రూ.30లక్షలు తన స్వంత డబ్బును వెచ్చించారు. ఆయన మరణానంతరం 12ఏళ్ళ తరువాత 1911లో ఆయన కలలు గన్న ఐఐఎస్సీ కార్యరూపందాల్చింది.దారిద్ర్య నిర్మూలనకు పైచదువులే సాధనమని నమ్మిన ఆయన 1892లో జె.ఎన్.టాటా ఎండోవ్‌మెంట్‌ను స్థాపించారు. కులమత వివక్షలేకుండా ఎందరో భారతీయులు ఇంగ్లండులో ఉన్నతచదువులు అభ్యసించడానికి ఈ ఎండోమెంట్ స్కాలర్‌షిప్పులను ఇచ్చింది.

ఆయన జీవితకాలంలోనే పూర్తికావించబడ్డ ప్రాజెక్టులలో బొంబాయిలోని తాజ్‌మహల్ హోటల్ ఒకటి. కేవలం తాను భారతీయుడైనందున హోటలు ప్రవేశం నిషేదించించడంతో ఆయన ఈ తాజ్ మహల్ హోటల్ నిర్మాణం చేపట్టారని చెబుతారు. కొడుకులు, కుటుంబ సభ్యులు సహితం నిరుత్సాహపరిచినా, ఆయన ఆనాటి అత్యాధినిక హంగులతో తాజ్‌మహల్ హోటల్ నిర్మాణం కావించారు. బొంబాయిలోనే విద్యుత్ ఉపయోగించిన మొట్టమొదటి భవనం ఆ హోటల్. అమెరికా నుండీ ఫ్యానులు, జర్మనీ నుండి ఎలివేటర్లు, ఇంగ్లీషు బట్లర్లు ఇలా ఎన్నో హంగులతో నెలకొల్పిన ఈ హోటల్ నిర్మాణానికి ఆరోజుల్లోనే రూ.4.21కోట్లు కోట్లు కర్చైయింది.

తాను సంపాదించిన ధనాన్ని దేశాభివృద్ధి ఖర్చుచేసిన పారిశ్రామిక వేత్త, జాతీయవాది, మనవతావాది, జమ్షెడ్జీ నుసేర్‌వాన్జీ టాటా. ఆయన మె 19, 1904న జర్మనీలో మరణించారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved