19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

నేషనల్ సైన్స్ డే

విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పి వారి అనుభవంలోకి తెచ్చే ప్రయత్నాలలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం (నేషనల్ సైన్స్ డే - ఎన్.ఎస్.డి) ఒకటి. ఫిబ్రవరి 28వ తేదీన ఏటేటా జరిగే ఈ ఉత్సవాన్ని 1987 ప్రారంభించారు. జాతీయ వైజ్ఞానిక, సాంకేతిక ప్రచార మండలి ప్రతీ సంవత్సరం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా చర్చలు, ప్రదర్శనలు, ఉపన్యాసాలతోపాటు క్విజ్ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులను, అధ్యాపకులను కూడగట్టి ప్రోత్సహించడం ద్వారా వైజ్ఞానిక దృక్పథాన్ని వ్యాప్తి చేయడంలో ఎన్.ఎస్.డి ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉన్నది.

ఫిబ్రవరి 28వ తేదీనే ఎన్.ఎస్.డి కోసం ఎంచుకోవడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్ 1928లో సరిగా ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్‌ను ప్రకటించారు. కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రయోగశాలలో రామన్ కనిపెట్టిన ఈ అంశం ఆయనకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి సంపాదించి పెట్టిన పరిశోధనల్లో ఒకటి. అందువల్ల ఎన్.ఎస్.డి కోసం ఎంపిక చేసిన ఫిబ్రవరి 28 భారతీయ శాస్త్రవేత్తలు, విజ్ఞానశాస్త్ర విధ్యార్ధులకు మరపురాని ఉత్తేజకరమైన రోజు.

జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని స్పష్టమైన లక్ష్యాలతో ప్రారంభించారు. శాస్త్ర ప్రాధాన్యతను దాని ఉపయోగాన్ని ప్రజలకు తెలియజెప్పడం వీటిలో ప్రాథమికమైనది. వైజ్ఞానిక పురోభివృద్ధి వేగవంతమైయ్యేందుకు ఇది అవసరం. వైజ్ఞానిక విషయాలను తేలికైన భాషలో విడమర్చి చెప్పే కమ్యూనికేటర్లను అభివృద్ధి చేసుకోవడం ఎన్.ఎస్.డిలో మరో ముఖ్య భాగం. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నిర్వహణ ద్వారా మన జాతి మెత్తం ఏడాదికి ఒకసారి తన పూర్తి దృష్టిని శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై కేంద్రీకరించడానికి వీలుకలుగుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో సైన్స్ పట్ల ఆసక్తిని, వైజ్ఞానిక పరిశోధనల ఫలితాలను తెలుసుకొనే అవకాశాన్ని కలిగిస్తాయి. శాస్త్ర వేత్తలు సాధారణ ప్రజలతో ముఖాముఖీ కలవడం ద్వారా శాస్త్ర సాంకేతిక పురోగతిని జనబాహుళ్యపు అవసరాలకు మలచుకోవడానికి వీలు కలుగుతుంది. జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఆధారపడుతున్న వ్యవసాయరంగానికి ఆధునిక పద్ధతులను, వంగడాలను పరిచయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆ దిశగా అవసరమైన భూమికను అభివృద్ధి చేయడానికి విజ్ఞానిక దినోత్సవం కొంతమేరకు కొంతమేరకు దోహదపడుతుంది. శాస్త్ర పరిశోధనల్లో తలమునకలై ఉండే వైజ్ఞానికులు, జీవన సమరంతో తీరికలేని సామాన్య ప్రజలు ఇద్దరిని ఒక్కచోటకు చేర్చే అరుదైన రోజుగా ఎన్.ఎస్.డి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

జాతీయ వైజ్ఞానిక, సాంకేతిక ప్రచార మండలి ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక అంశాన్ని ఎంచుకుంటూ వస్తోంది. ప్రాధమిక విజ్ఞాన శాస్త్రాలపట్ల ఆసక్తిని మళ్ళీ పెంపొందింపచేయడం, సమాచార సాంకేతిక విజ్ఞానం సాయంతో సైన్స్ బోధన, వ్యర్ధం నుంచి సంపద, డి.ఎన్. ఏ ఆవిష్కరణ స్వర్ణోత్సం, భౌతిక శాస్త్రం పురోభివృద్ధి, మోర్ క్రాప్ ఫర్ డ్రాప్ పేరిట సమర్ధ సేద్యపు నీటి వినియోగం వంటి అంశాలను సైన్స్ డే ఉత్సవాలకు ముఖ్యాంశాలుగా ఎంచుకున్నారు. 2009కి గాను "సైన్స్ విస్తృతి పెంపొందించడం" (ఎక్స్‌పాండింగ్ హొరైజెన్స్ ఆఫ్ సైన్స్‌) థీమ్‌గా స్వీకరించారు.

శాస్త్ర అంశాలని సులభగ్రాహ్యంగా మార్చి ప్రజలకు తెలియజెప్పడానికి ఎంతో ప్రాధాన్యత వుంది. దీనిని గుర్తించిన జాతీయ వైజ్ఞానిక సాంకేతిక ప్రసార మండలి కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక శాకతో కల్టివేషనల్ సైన్స్ పాపులరైజేషన్ అవార్డులను ఇస్తుంది. సమాజపు సంపూర్ణ అభివృధికి తోడ్పడే విధంగా వైజ్ఞానిక అంశాలను తెలియజెప్పడాన్ని ఎన్.ఎస్.డి సందర్భంగా గుర్తించి అవార్డులు ప్రధానం చేస్తున్నారు. తొలుత ఐదు అవార్డులను ఇస్తూవచ్చిన తరువాత నిర్వాహకులు అవార్డులను మూడుకు పరిమితం చేశారు.

ప్రపంచం 21వ శతాబ్దంలోకి ప్రవేశించి వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో కూడా భారత సమాజంలోని కొన్ని వర్గాలు మూఢ విశ్వాసాలలో మగ్గుతున్నాయి. అభివృద్ధి చెంది ఆధునిక దృక్పథాన్ని అలవరుచుకొన్న వర్గాల సంఖ్య క్రమంగా పెరిగుతున్నప్పటికీ, సమాజం మొత్తం శాస్త్ర దృక్పథాన్ని అనుసరించడం ఇంకా పూర్తిగాని లక్ష్యంగానే మిగిలివుంది. ఇది దేశ అభివృద్ధి ప్రయత్నాలను కుంటుపరచడమేకాక ప్రజల వ్యక్తిగత, కుటుంబ పురోగతికి కూడా ఆటంకంగా ఉంటోంది. ఎన్.ఎస్.డి. ని పాటించడం, ఉత్సవాలు జరపడం పౌరుల్లో శాస్త్ర దృక్పథాన్ని అలవరుచుకునే వారి సంఖ్యను పెంచుతుంది. తిరుగులేని హేతుబద్ధమైన ఆలోచనను రేకెత్తించండం మానవ సంక్షేమంలో శాస్త్ర విజ్ఞానాల పాత్ర. ప్రయోగాత్మక పరిశీలనలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం కచ్చితమైన ఫలితాలనిస్తుంది.

ఉత్సవాలను నిర్వహించడంతో సరిపుచ్చకుండా వాటి స్పూర్తిని కొనసాగించడం ద్వారా దేశం మెరుగైన ప్రయోజనం పొందగలదు.

ఇంకా

శాస్త్ర సాంకేతిక రంగం - జాతీయ విధానం

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved