19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రెండో ఎస్సార్సీ ఎలా అంటే

మహారాష్ట్రలోని కోపర్‌గాఁవ్ లోక్‌సభ సభ్యుడు బాలాసాహెబ్ విభేపాటిల్ రాష్ట్రాల పునర్విభజన కమీషన్ కోసం గత ఏడాది నవంబరు 15న లోక్‌సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టారు. పాటిల్ కేవలం ప్రవేశపెట్టి మిన్నకుండిపోలేదు. రాష్ట్రాల పునర్విభజన సంఘం ఎలా వుండాలి, దాని విధి విధానలపై సూచనలుకూడా చేయడం విశేషం.

  1. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నాయకత్వంలో కమీషన్ వేయాలి.
  2. అందులో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అవగాహన ఉన్న ఐదుగురు నిపుణులను సభ్యులుగా నియమించాలి.
  3. ప్రతిరాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఒకరిని సభ్యులుగా నియమించాలి.
  4. కొత్తరాష్ట్రాల డిమాండ్లు ఆస్తుల పంపిణీ, అధికారులు, ఉద్యోగుల కేటాయింపు, నదీ జలాలు, సహజ వనరుల పంపిణీ తదితర బాధ్యతలను కమీషనుకు అప్పగించాలి.
  5. కమీషన్ నివేదికకు నిర్దిష్ట గడువు విధించాలి.
  6. కొన్ని ప్రత్యేక అంశాలపై ఉపకమీషన్లు ఏర్పాటు చేసేందుకు కమీషన్‌కు స్వేచ్ఛనివ్వాలి.

విభేపాటిల్ తీర్మానంలో వల్లించిన ఆదర్శాలన్నీ బాగున్నాయి. కానీ, ఏళ్ళ తరబడి నలుగుతున్న తెలంగాణా అంశాన్ని ఇతర డిమాండ్లతో పోల్చడం సరికాదు. తెలంగాణా డిమాండ్ ఉన్నంత తీవ్రంగా ఇతర ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ లేదన్నది వాస్తవం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved