22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రెండో ఎస్సార్సీపై కాంగ్రెస్ సభ్యుడి బుల్లు

తెలంగాణా అంశాన్ని ఎటూ తేల్చని కాంగ్రెస్ రెండో ఎస్సార్సీ రూపంలో దానిని అటక ఎక్కించేందుకు తనవంతు ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలోని కోపర్‌గాఁవ్ లోక్‌సభ సభ్యుడు బాలాసాహెబ్ విభేపాటిల్ రాష్ట్రాల పునర్విభజన కమీషన్ కోసం గత ఏడాది నవంబరు 15న లోక్‌సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టారు. 17వతేదీకి బిల్లువాయిదా పడింది. ఆతర్వాత మళ్ళీ 31వతేదీకి వాయిదా వేశారు. పాటిల్ ఉద్దేశ్యపూర్వకంగా "తెలంగాణా" అంశాన్ని తెరమరుగుచేసేందుకు రెండో ఎస్సార్సీ ప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చారు. దీనికి కాంగ్రెస్ అధిష్టానం మద్దతిచ్చింది.

రాష్ట్రాల పునర్విభజన చట్టం - 1956 ప్రకారం 14రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. అతర్వాత వివిధ సందర్భాల్లో కొత్తరాష్ట్రాలు ఆవిర్భవించాయి. ఎన్డీయే హయాంలో 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌ఘడ్ పురుడుపోసుకున్నాయి. తర్వాత కూడా కొత్త రాష్ట్రాల డిమాండ్లు తెరపైకి వచ్చాయి. తెలంగాణాతో పాటు మహారాష్ట్రలో విదర్భ, యూపీ, ఎంపీ, బీహార్, చత్తీస్‌ఘడ్‌లలో భీజ్‌పురీ మాట్లాడే ప్రాంతాలను విడగొట్టి బుందేల్‌ఖండ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అదేవిధంగా గుజరాత్ నుంచి సౌరాష్ట్ర, కర్ణాటక నుంచి కూర్గ్, పశ్చిమ ఒరిస్సా నుంచి కొశలాంచల్, పశ్చిమ బెంగాల్, ఉత్తర బీహార్‌లోని మిథాలి భాష మాట్లాడే ప్రాంతంల నుండి వేరొక రాష్ట్రం, ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాలతో డార్జిలింగ్ హిల్స్ రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు సాగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పూర్వాంచల్, హరిత ప్రదేశ్, బ్రిజ్ ప్రదేశ్, అవధ్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలన్న అభ్యర్ధనలు ఈనాటివి కావు.

కోపర్‌గాఁవ్ ఎంపీ పాటిల్ ప్రైవేటు బిల్లులో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించారు. అంటే ఒకరకంగా తెనె తుట్టెను కదిపినట్టే. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి డిమాండ్లు ఇంకా పెరగవచ్చు. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో సమతుల్యత లోపించి శాంతి భద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని పాటిల్ పేర్కిన్నారు. రెండో ఎస్సార్సీ పేరుతో తెలంగాణా అంశాన్ని మరుగున పరచటమే అసలు లక్ష్యం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved