19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ప్రైవేటు తీర్మానం కథ ఎట్టిదనిన...

By జి, శివ కుమార్

’ప్రత్యేక తెలంగాణ’కు సంబంధించి భారతీయ జనతా పార్టీ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ ప్రవేశపెట్టిన తీర్మానం వాస్తవానికి ఫిబ్రవరి 20న రాజ్యసభలో చర్చకు రావలసి ఉంది. రాజ్యసభ వ్యవహారాల జాబితాలో ఈ అంశానికి చోటు లభించింది. నాటి జాబితాలో ఇది రెండోఅంశం. మధ్యాహ్న కాలంలో రెండవ అంశంగా ఇది చర్చకు రావలసి ఉంది. కానీ అనివార్యంగా ఈఅంశం ఫిబ్రవరి 26 కు వాయిదా పడింది. వాస్తవానికి చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతో బీజేపీ, తెరాస ఎంతో ఆసక్తి తో ఎదురుచూశాయి. తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు ఇందుకోసం ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు కూడా. కానీ చర్చ వాయిదా పడడంతో వారు నిరాశ చెందారు. సాధారణంగా ప్రతి శుక్రవారం సభలో ప్రైవేటు బిల్లులకు అవకాశం ఉంటుంది. అయితే, ఏకారణం చేతైనా, ఆ రోజు సభ వాయిదా పడినట్లైతే దాని కథ ముగిసినట్లే.

లోక్‌సభలో చర్చ లేనట్లే

14వ లోక్‌సభకు సంబంధించి తెలంగాణ ప్రైవేట్ బిల్లు ఇక చర్చకు రానట్టే. ఫిబ్రవరి 26తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. మళ్ళీ ఎన్నికలు జరిగి, కొత్తసభ ఏర్పడ్డాక ఈ అంశం ఖచ్చితంగా తెరమరుగౌతుంది. ఎన్నికల ఫలితాలను బట్టి ‘తెలంగాణ’ అంశం సజీవంగా ఉంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇదే అంశంపై భాజపా సభ్యుడు పి.ఎస్. గదావి (P.S. Gadhavi) గతంలో ప్రవేశపెట్టిన తీర్మానంపై కూడా ఫిబ్రవరి 20వ తేదీనే చర్చ జరగాల్సి ఉంది. గత ఏడాది ఆఖర్లో జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై కొద్దిమేరకు చర్చ జరిగింది. తర్వాత ఫిబ్రవరి 20కి వాయిదాపడింది(నోట్:ఫిబ్రవరి 20న ప్రైవేటు సభ్యుల బిల్లులు/తీర్మానాల చర్చలు చేపట్టలేదు. ఈ అంశం చర్చకురాలేదు).

కొసమెరుపు

తెలంగాణా కోసం తీవ్రంగా పోరాడుతున్న తెరాస, గత ఐదేళ్లలో ఏనాడు ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశ పెట్టలేదు. ఐదుగురు ఎంపీలున్నప్పటికి ఆదిశగా వారు దృష్టి సారించలేదు. తెలంగాణా కోసం తెలంగాణా ఎంపీలు లేదా ఆంధ్రా ఎంపీలు బదులు గుజరాత్, మహరాష్ట్రా ఎంపీలు బిల్లులు ప్రవేశపెట్టడం సిగ్గుచేటు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 14వలోక్‌సభ హయాంలో ఈ బిల్లు చర్చకు రావడం అసాధ్యమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved