19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలంగాణ.....పార్టీల తిరకాసు

తెలంగాణ.... గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర, జాతీయ రాజకీయ చరిత్రలో ప్రముఖంగా చోటుచేసుకున్న అంశం. ఎన్నికల ప్రకటన నేపధ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. 2004 ఎన్నికల సమయంలో ముఖం చాటేసిన పార్టీలు కూడా ప్రస్తుతం తెలంగాణ అంశాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నాయి. ప్రాంతీయం నుంచి జాతీయం వరకు అన్నింటిదీ ఒకే దారి. తెలంగాణకు వ్యతిరేకం కామన్నది వాటి బాణి. అలా అని అనుకూలమని కూడా నాన్చకుండా ప్రకటించక పోవడం వాటి అవకాశవాద వైఖరిని వెల్లడిస్తున్నాయి. 'తప్పనిసరి తద్దినం' అన్నట్లు బలవంతంగా 'తెలంగాణ' తలకెత్తుకున్న పార్టీలు ఏదశలోనూ చిత్తశుద్ధి కనబరచలేదన్నది చేదునిజం. తెలంగాణ అంశాన్ని రాజకీయ లబ్ధిగా వాడుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి

తెలంగాణ సాధన కోసం ఒక్క తెరాస తప్ప ఏపార్టీ పోరాటపటిమను ప్రదర్శించలేకపోతున్నాయి. ఇక తనకుతాను ఉద్యమపార్టీగా అభివర్ణించుకునే తెరాస కూడా ఓట్లవేట, రాజకీయ వ్యవహారంలో పడి అసలు లక్ష్యంను విస్మరిస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

90వ దశకంలో కాకినాడ తీర్మానంలో ఈ అంశాన్ని భుజానికి ఎత్తుకున్న భారతీయ జనతా పార్టీయే ఎంతోకొంత చొరవ తీసుకుంటున్నట్లు కనపడుతోంది. పోరాటాలు చేయనప్పటికీ పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా అప్పుడప్పుడూ ఏదో ఒక హడావిడి చేస్తోంది. ప్రస్తుత పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రైవేట్ తీర్మానం ఆకోవలోకే వస్తుంది. ఆ తీర్మానం ఫిబ్రవరి 20న ఎగువసభ (రాజ్యసభ)లో చర్చకు రావలసిన అంశం కాగా అది 26కు వాయిదాపడింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved