19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు సినిమా నాయనమ్మ - నిర్మలమ్మ

నిర్మలమ్మ 1950 లో సినీ జీవతాన్ని ప్రారంబించారు. తల్లిగా, బామ్మగా అనేక చిత్రాలలో నటించారు. ప్రముఖ హీరోలందరికి, హీరోయిన్లకి బామ్మగా జీవిస్తూ అందరికీ ఆత్మీయురాలిగా అందరి మనసులలో నిలిచారు. సినిమాలలోనే కాదు షూటింగం సమయంలో సెట్లో ఉన్న వారందరికీ కూడా ఆమె బామ్మే!

నాటి సినిమాలైన కులగోత్రాలు, భార్యాభర్తలు నుండి నేటి సినిమా వరకూ ఆమె ఎన్నో సినిమాలలో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. ఆమె ఒక లెజండ్ . ఆమె తన 89వ యేట గురువారం నాడు (ఫిబ్రవరి 19, 2009) వయసుతో వచ్చిన శారీరక సమస్యలతో తనస్వగృహంలో తుది శ్వాస వదిలారు.

మచిలీ పట్నానికి చెందిన నిర్మలమ్మ అసలు పేరు రాజామణి. తన పదహారో ఏట ప్రతిభా ఫిలిం వారి గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె వేషం వేశారు. ఆతరువాత పాదుకా పట్టాభిషేకం సినిమాలో పదిహేడో ఏట నటించారు. అనంతరం కొద్దికాలం విజయవాడ, బందరు మధ్య ఉంటూ రేడియోలలో, నాటకాలలోనూ ప్రోగ్రాములు ఇస్తుండేవారు. ఆమె అందరి డైరెక్టర్ల వద్ద పనిచేశారు. దాసరి నారాయణరావు గారి వద్ద అధిక చిత్రాలలో నటించారు. ఆమె నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులుతో సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

అలనాటి నటులు యన్ టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి మహా నటులకు తల్లిగా, అక్కగా నటించారు. కాని యస్వి రంగారావు, నాగయ్య వంటి అగ్రనటులకు తల్లిగానే కాదు భార్యగా కూడా నటించారు. ఆమె జీవితంలో మరచిపోలేని విషయం అమావాస్య చంద్రుడు సినిమాలో యల్.వి. ప్రసాద్ గారికి భార్యగా నటించడం అని అంటారు. ఆమె తెలుగు సినిమా వజ్రోత్సవ కార్యక్రమంలో (2007)పాల్గొన్నప్పుడు ఆమె అనుభవాలు నలుగురితో పంచుకున్నారు.

ఆమె నటనా జీవితంలో మలుపు తిప్పిన చిత్రాం మనుషులు మారాలి . ఆ చిత్రంతో ఆమె నట జీవితం మారిపోయింది. యమగోల , పదహారేళ్ళ వయసు , ఆపద్భాంధవుడు , స్వాతి ముత్యం ..లాంటి చిత్రాలు ఆమె నటజీవితానికి మైలు రాళ్ళు. దాదాపు 800 పైగా చిత్రాలలో నటించిన ఆమె తెలుగు, తమిళ భాషలలో నటించారు. చిరంజీవిగారి బామ్మగా నటించిన స్నేహం కోసం సినిమా ఆమె ఆఖరి చిత్రం అని చెప్పచ్చు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved