22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

గోపాల కృష్ణ గోఖలే - సమున్నత వ్యక్తిత్వం

గోపాల కృష్ణ గోఖలే - సమున్నత వ్యక్తిత్వం కల వ్యక్తి. గోపాల కృష్ణ గోఖలే గారు భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్రపోషించారు. బ్రిటన్‌ ప్రభుత్వము, భారతావనిలో ఇంగ్లీషు వారి ప్రభుత్వాలు రెండూ గోపాలకృష్ణ గోఖలేని భారతీల ప్రతినిధిగా భావించాయి. భారతీయ, పాశ్చాత్య సంస్కృతుల మధ్య సమన్వయకర్తగా నిలిచిన గోపాలకృష్ణ గోఖలే తన తరంలోని యితర నాయకులకంటే భిన్నంగా వుండేవారు. ఆ విభిన్న వ్యక్తిత్వమే గాంధీలాంటి వారిని ఆకట్టుకొని, వారిని తమ (రాజకీయ) 'గురువు' గా భావించేలా చేసింది.

మాహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని కోట్లుక్‌లో 1886 మే 9న గోఖలే ఒక సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. గోఖలే ఇంగ్లండ్ వెళ్ళి ఇండియన్ సివిల్ సర్వీసులో(Indian Civil Services - ICS) చేరాలని ఆయన సోదరుడు ఆశపడ్డారు. కాని గోపాల కృష్ణ గోఖలే అందుకు భిన్నంగా జస్టిస్ రణడే శిష్యరికంలో భారతీయ అర్ధశాస్త్రాన్ని అభ్యసించారు. 1900 సంవత్సరంలో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన గోఖలేకి అక్కడ ఫిరోజ్‌షా మెహతా సహచర్యం లభించింది. 1902 లో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యులయ్యారు. ఆ సమయంలో అస్తవ్యస్తతమై ఉన్న భారత ఆర్ధిక వ్యవస్ధ గురించి గోఖలే ఉపన్యసించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ఆయనలోని ఆర్ధికవేత్తను ప్రంపంచానికి పరిచయం చేసింది. 1905 లో బెనారస్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు గోఖలే చేసిన ప్రసంగం నేటికీ అత్యుత్తమ ప్రసంగాలలో ఒకటిగా కీర్తించబడుతోంది.

ప్రవాసభారతీయుల కోసం

విదేశాలలో వున్న భారతీయుల హక్కుల సాధన పట్ల గోఖలే శ్రద్ధ చూపేవారు. అటువంటి సమయంలో గోఖలేకి దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణకోసం ఉద్యమించిన గాంధీ పరిచయం అయ్యారు. వారి ఉద్యమానికి ఆయన పరిపూర్ణ మద్దతునిచ్చారు. తరువాత కూడా కొనసాగిన వారి పరిచయం గురుశిష్యుల బంధంగా అభివృద్ధిచెందింది.

స్వాతంత్ర్య సమరయోధునిగా, నాయకునిగా, ఆర్ధికవేత్తగా పలువురిని ప్రభావితం చేసిన గోపాల కృష్ణ గోఖలే పిభ్రవరి 19, 1915న పరమపదించారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved