22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మూల పురుషుడు దాదా సాహెబ్ ఫాల్కె

భారత చలనచిత్ర పరిశ్రమకు ఆద్యునిగా పేర్గాంచిన శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే(30/04/1870 - 16/02/1944).

నేడు మన బారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆటవిడుపునూ అందిస్తోన్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేర్గాంచిన వారు శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే( Dhundiraj Govind Phalke. ) నాసిక్‌కు 30కిలోమీటర్ల దూరంలోని త్రియంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బరోడాలోని కళాభవన్‌లలో ఆయన విధ్యాభ్యాసం చేశారు. 1896లో ఆయన బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో ఏసుక్రీస్తు చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూడటం జరిగింది. ఆ ప్రభావంతో ఆయన హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియాలన్న సంకల్పానికి వచ్చారు. 1913లో ఆయన తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన ఆయన సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. ఈ కాలంలో ఆయన 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించారు. ఆయన నిర్మించినవన్నీ మూకీ చిత్రాలే.

తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా ఆయన సినీపరిశ్రమకు తిరిగివెచ్చించారు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. ఐదుగురు వ్యాపారవేత్తలతో కలసి ఆయన హిందుస్థాన్ ఫిల్మ్స్ ను ఆయనస్థాపించారు. వాణిజ్య విషయాలు వారు చూసుకుంటుండగా కళాత్మక విషయాలు ఆయన నేతుత్వం వహించారు. కానీ భాగస్వాములతో వచ్చిన తేడాలవల్ల ఆయన హిందుస్థాన్ ఫిల్మ్స్‌ను వీడి వెళ్ళారు. కొంతకాలం తిరిగి వచ్చినప్పటికీ ఆ సంస్థ ఎక్కువకాలం కొనసాగలేదు.

1932లో ఆయన సేతుబంధన్ చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువతికాలంలో అప్పుడే పుట్టిన శబ్దచిత్రాలతో మూకీ చిత్రాలకు విలువతగ్గింది. తన చివరి చిత్రం గంగావతరణ్‌ను శ్రీ ఫాల్కే 1937లో నిర్మించారు.

చివరికాలంలో ఆయన తనకంటూ పెద్దగా ఆస్తులనేమీ మిగుల్చుకోలేదు. 1938లో భారత చలనచిత్రాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సమయానికి ఆయనకు తనకంటూ ఒక ఇల్లు కూడా లేదు. ప్రభాత్ ఫిలిమ్స్ అధినేత శాంతారాంబాపు వనకుర్తే తదితరుల సహాయంతో ఇల్లును సమకూర్చుకున్న కొద్దికాలంలోనే, 1944లో ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.

భారత సినీపరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1966లో ఆయన పేరిట అవార్డును ఏర్పాటు చేసింది.

ఇంకా

ఫాల్కే చిత్రాల పేర్లు(ఇంగ్లీషులో)

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved