19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సినిమా పిచ్చి బాబాయి

By , బామ్మగారు

మాకో బాబాయి వున్నాడు. ఆయనకు సినిమాలంటే చెప్పలేనంత పిచ్చి. ప్రతిరోజూ సెకండ్ షో సినిమా చూసి రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వొచ్చేవాడు. అప్పుడు భోజనం చేసి పడుకునేవాడు. ఆ రోజుల్లో విజయవాడ నగరం సినిమాలకు పెట్టింది పేరు. బాబాయి తల్లిదండ్రులు, సామ- దాన- భేద- దండోపాయాలతో, బాబాయికున్న ఈ అలవాటును మాన్పించటానికి ప్రయత్నించారుట. వాళ్ళే విసిగిపోయి బాబాయిని " బాబాయి దారి " కి వదిలేశారుట.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ ఒక్క సినిమాపిచ్చి తప్పితే బాబాయికెలాంటి వ్యసనాలూ లేవు. నిజంగా మామంచి బాబాయే!అందుకనే ఆయన్ను మా చిన్నప్పటినుండి "సినిమా పిచ్చి బాబాయి" అనే పిలిచేవాళ్లం. బాబాయి కూడా మాఆ పిలుపును పట్టించుకునేవాడు కాదు.

పెళ్ళయ్యాక మొదటి రాత్రి కూడా, బాబాయి సెకండ్ షో - సినిమా చూసొచ్చి గదిలోకెళ్ళాడని నా చిన్నప్పుడు కథలు- కథలుగా చెప్పుకునేవారు. మా పిన్ని కూడా బాబాయికున్న ఈ సినిమాపిచ్చి ని వదలగొట్టాలని - ఏడ్చి రాగాలుతీసి, పోట్లాడి రభస చేసి,చివరకు కొన్నాళ్లు పుట్టింటిలో వుండిపోయి ఓ ' పెద్దసినిమానే ' చేసిందట. - యిలా నానా రకాలుగా తంటాలుపడి విసిగిపోయి - ఆయన మానాన ఆయన్నొదిలేసింది.

దేవుడి దయవల్ల ఆయనకు ఏ అనారోగ్యాలు లేవువయసుమీదపడింది...కానీ సినిమా పిచ్చిమాత్రం పోలేదు. తగ్గనూలేదు! ఇప్పటికీ సినిమా పిచ్చి బాబాయి ఎవరింటికెళ్ళినా, ఏ వూరెళ్ళినా అక్కడి సినిమాలు చూడవలసిందే. కాబోతే సెకండ్ షో నుండి ఫస్ట్ షో కి షిఫ్ట్ అయ్యాడు! మా సినిమాపిచ్చి బాబాయిని యిప్పుడు అందరూ, పిన్నితో సహా, "పిచ్చి బాబాయ్" అంటున్నారని తెలిసి బాధేసింది.

ఓ వారం రోజులు ఆనందంగా గడపటానికని, ఆ సినిమాపిచ్చి బాబాయి మా పిన్నితో కలిసి ఆ మధ్యనొకసారి మా యింటికి వచ్చాడు.వచ్చిన మర్నాడు కాఫీగ్లాసు తీసుకుని సినిమాపిచ్చి బాబాయికి అందించి " ఏ సినిమాకెళ్ళావు బాబాయ్?" అని అడిగాను. చెప్పాడు.

" ఎలా వుంది? " అన్నాను తిరిగి.

" ఎలా వుందేమిటే..?! ఛండాలంగా వుంది. చూసేవాళ్ళు శుంఠలూ, వాజెమ్మలూ, నిరక్షరాస్యులూ అనుకుంటున్నారో యేమిటో?! .....లేకపోతే యేమిటీ?!

.....వికలాంగులు పరీక్ష రాయాలంటే ప్రభుత్వం పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్ లాంటివి ఛస్తాయిగా....వాటికనుగుణంగానే పరీక్షలు రాయాలిగా!

ఏ గుడ్డివాడో, కుంటివాడో పరీక్ష రాయాలంటే తమస్థానంలో పరీక్ష రాసేవాడ్ని ముందే నిర్ణయించుకొని వాడి పేరు, వూరు మొదలగు వివరాలన్నీ ముందుగానే పరీక్షాధికారులకు రిటెన్‌గా ( written గా) తెలియజేయాలిగా!

అంతేగాని పరీక్ష మొదలవటానికి ముందు, బెల్లుకొట్టాక, అప్పుడు రోడ్లమీద పడి.....మీరు నా పరీక్ష రాయండి ప్లీజ్...... మీరు నా పరీక్ష రాస్తారా ప్లీజ్ అని పరుగులు పెట్టటమేమిటి?!

అల్లా అడిగిందేకాక రాయటానికి సంసిద్ధత తెల్పని వాళ్ళందరినీ కర్కోటకులుగానూ, పాషాణ హృదయులుగానూ చూపట మేమిటీ?!....ఏమన్నా అర్ధం వుందా దీనికి?!

దారినబోయేవాడెవడో ఒకడలా పరీక్ష రాస్తానంటే అధికారాలు, నిబంధనలు అనుమతిస్తాయా?!

ఏం సినిమా... వెధవ సినిమా...తీసేవాళ్ళకు ఆమాత్రం జనరల్ నాలెడ్జి వుండొద్దా?! ఛ..ఛ..ఛ..... "

"....."

"నా ఉద్యోగాన్వేషణ పర్వంలో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌కి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది. నేను ఎగిరి గంతేసి సంబరపడిపోయాను. బాగా ప్రిపేర్ అయ్యానుకూడా. తీరా టైముకు టైఫాయిడ్ జ్వరమొచ్చి ఆ ఇంటర్వ్యూకే వెళ్ళలేదు. ఏం చేస్తాం ? ప్రాప్తం లేదని బాధపడ్డాను. అంతేగాని ఎవర్ని వేలెత్తి చూపుతాము ?!"

"......"

"చేతనయిన సాయం చెయ్యండని చెప్పటంలో తప్పులేదు. ముగ్గురికి చెయ్యండి అంటే తరువాత చేతులు ముడుచుక్కూర్చోమనా?!"

"....."

"తన చుట్టూ వున్నవాళ్లకి - అదే తన అయినవాళ్ళందరికీ - బాగా మంచి చేస్తాడని ఏదో రాష్ట్రం సి.యం గురించి కూడా అనుకుంటున్నారు. అంటే అది రైటా ?!...."

"...."

ఇలా ఆరోజంతా అప్పుడప్పుడూ ఒకటొకటిగా ఆసినిమాలోని లోపాలను ఎత్తిచూపుతూ, విసుక్కుంటూ కసురుకుంటూనే వున్నాడు మా సినిమాపిచ్చి బాబాయి. రెండో రోజు ఉదయం బాబాయితో మాట్లాడటం కుదరలేదు.తరువాత మధ్యాహ్నం భోజనాలప్పుడు

"నిన్నటి సినిమా విశేషాలేమిటి బాబాయ్" అన్నాను.

పేజి   1 |   23 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved