17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కాంగ్రెస్‌లో ప్రధాని పదవికి అభ్యర్ధులు

By చతుర్వేదుల, మూర్తి

2004ఎన్నికల అనంతరం ప్రధాని పదవికోసం విశ్వప్రయత్నాలు చేసి విపక్షాల విమర్శన్రాస్తాలతో త్యాగంచేసి త్యాగమయిగా పేరొందిన యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ నేటి బరిలోకూడా దాదాపుగా లేనట్టే తెలుస్తోంది. తనకు బదులుగా ఆ స్థానంలో తనయుడు రాహూల్ గాంధీని గద్దెనెక్కించాలని ఉవ్విళ్ళూరుతుండగా అందుకు ఆ యువనేత అయిష్టంగా ఉన్నట్లు సంకేతాలందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ హావభావాలను పుణికిపుచ్చుకున్న ప్రియాంకను రంగంలో దింపాలన్న ఆలోచన కూడా మేడంలో లేకపోలేదు. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల అనంతరం అదృష్టం బాగుండి మరోసారి యూపీఏ ప్రభుత్వమే ఏర్పడి...ప్రభుత్వానికి మద్దతునిచ్చే మ్రితపక్షాలు అనువంశికపాలనకు అడ్డుపుల్ల వేసినట్లయితే మరోసారి మన్మోహనుడే కంటిన్యూకావచ్చు. కాంగ్రెస్ లో మరో సీనియర్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ కూడా తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నా వృధాయేనని పరిశీలకులు భావిస్తున్నారు. రాజీవ్ హయాంలో ఆయనతోవిభేదించి స్వతంత్ర జెండా ఎగురవేయడమే ఆయన అనర్హతకు కారణంగా పేర్కొనవచ్చు.ఇంకా

బిజెపిలో మహాబలులు

ప్రాంతీయ పార్టీల పీఠాధిపతులు


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved