17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ప్రధాని రేసులో ఎందరో మహానుభావులు

By చతుర్వేదుల, మూర్తి

లోక్ సభకుఎన్నికలు సమీసిస్తున్న నేపథ్యంలో రాజకీయ అతిరథ మహారథులెందరో దేశ అత్యున్నత పీఠమైన ప్రధాని పదవిపై కన్నేసి తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరంచేస్తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత్‌లో హోదాపరంగా రాష్ర్టపతి పదవే నంబర్ వన్ అయినా క్రియాశీలకంగా అగ్రతాంబూలం ప్రధాని పదవికే దక్కుతుంది. కనీసం ఆరుమాసాలైనా...ఆపద్ధర్మ ప్రధానిగా అయినా అందలమెక్కితేచాలు...జన్మధన్యమైనట్లు ఎందరో మహానేతలు భావిస్తుంటారు. సంకీర్ణ ప్రభుత్వాల హవా మొదలైనప్పటినుంచి అభ్యర్థి శక్తిసామర్థ్యాలకన్నా అదృష్టానిదే పైచేయిగా మారిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే పార్టీపరంగా బలం, జనాకర్షణ ఏమాత్రం లేని దేవేగౌడ, ఐకే గుజ్రాల్ వంటి నేతలను ఆ మహా సింహాసనం అక్కున చేర్చుకొంది. దశాబ్దాల తరబడి ఆ సదవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులు ఎందరో...మరెందరో. జాతీయరాజకీయాల్లో ఏకపార్టీ పాలనకు తెరపడటంతో ప్రధాని పదవి అభ్యర్థిని నిర్ణయించడంలో క్రమక్రమంగా ప్రాంతీయపార్టీల ఆధిపత్యం ఎక్కువైపోయింది. కొద్దికాలం కాంగ్రెస్ మద్దతుతో మూడోకూటమికి చెందిన నాయకుల హవాకొనసాగగా తదనంతరం బీజేపీ నేతృత్వంలో మ్రిశమప్రభుత్వాల పాలన మొదలైంది. 2004ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ యూపీఏ పాలనకు తెరతీసింది.

కాంగ్రెస్‌లో క్యూ

బిజెపిలో మహాబలులు

ప్రాంతీయ పార్టీల పీఠాధిపతులు

బరిలో ఎందరు ఉన్నా, వీరందరు కాకుంగా మరో అనామక నాయకుడు గద్దెనెక్కినా ఆశ్యర్యపడవలసిన అవసరంలేదు. కేవలం ఓ జాతీయ పార్టీ నాయకుడు ప్రధాని అయ్యే రోజులుపోయాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీల అనుగ్రహం ఉంటే ఎవరైనా నేటి రోజుల్లో దేశ అత్యున్నత పీఠాన్ని అందుకోగలరు. లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్టించే అదృష్టం ఎవరిని వరించనుందో వేచిచూడాల్సిందే. అద్వానీ చిరకాల కోరిక నెరవేరనుందా... అనువంశికపాలనలో భాగంగా రాహూల్ లేదా ప్రియాంకలు దేశసారథ్యపగ్గాలను చేపట్టనున్నారా... అనూహ్యంగా మాయావతి చక్రం తిప్పనున్నారా...తదితర విషయాలను తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి ఉండక తప్పదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved