17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఇక త్యాగాలు - వలసలు షురూ!

By చతుర్వేదుల, మూర్తి

ఇప్పటివరకు పొత్తుల తేలక కాస్త ఇబ్బంది పడిన రాజకీయ పక్షాలకు మహాకూటమి ఆవిర్భావం లైన్ క్లియర్ చేసిందనే చెప్పుకోవచ్చు. పొత్తుల ప్రక్రియలో ఊరించి...ఊరించి...టిఆర్ ఎస్ హ్యాండ్ ఇవ్వడంతో తెలంగాణాలో త్రిముఖ తిట్ల పురాణం ఇక ఊపందుకోనుంది. అటు కాంగ్రెస్, ఇటు పిఆర్పీ మహాకూటమిని అనైతిక రాజకీయమని ఎద్దేవా చేస్తుంటే, మీరునేర్పిన విద్యయే అని టీడీపీ కాంగ్రెస్‌ను విమర్శిస్తోంది. కాంగ్రెస్ అవినీతిమయం అని తెదాపా ప్రరాపా విరుచుకుపడుతుంటే, సినిమా చార్మ్ ఓట్లు కురిపించదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

మాటల తూటాలు ఎలా ఉన్నా, మహాకూటమి ఆవిర్భావం కాంగ్రెస్, పీఆర్పీ పార్టీలలో టిక్కెట్ల పంపిణీని సులభతరం చేయగా టిడిపి, టిఆర్‌ఎస్ లలో కలకలం రేపనుందనుటలో ఎటువంటి సందేహం లేదు. వామపక్షాల సహకారంతో పురిటినొప్పుల నుండి ఏదోలా బయటపడి మహాకూటమి అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చంద్రబాబు, కేసీఆర్ లకు ఇక బాలింత కష్టాలు మొదలు కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు పార్టీల్లోనూ తిరుగుబాటు జెండాలు ఎగురక తప్పేట్టులేదు. ఏ ఏ పార్టీ ఏ ఏ సీట్లను పంచుకోవాలన్న విషయం కూడా మహాకూటమి అధినేతలకు శిరోభారంగా మారుతోంది. పొత్తుల పరీక్షలను నానా తంటాలు పడి గట్టెక్కిన చంద్రబాబు, కేసీఆర్ లకు సీట్ల పంపిణీ నిజంగా అగ్ని పరీక్షే.ఇంకా

రాజకీయం చాలా హాట్ గురు - మళ్ళీ చెయ్యి కాల్చుకున్న చిరు

రాజకీయ సంతలో కుదిరిన బేరం - ఎట్టకేలకూ మహాకూటమి ఆరిర్భావం

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved