22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అజాత శత్రువు ఆర్వీ అస్తమయం

పరిపూర్ణ జీవితం గడిపిన మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ (98) సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అందరి మనిషిగా అజాత శత్రువుగా గుర్తింపు పొందారు. అన్నివేళలా మోముపై చెరగని చిరునవ్వుతో ప్రత్యర్థులను సైతం ఆయన ఇట్టే ఆకట్టుకునే వారు. న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి అత్యున్నతమైన దేశాధ్యక్షపదవిని అలంకరించిన వెంకట్రామన్ కాంగ్రెస్‌కు, గాంధీ కుటుంబానికి చరమాంకం వరకు విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు. రాజకీయంగా కష్టకాలంలో ఇందిరాగాంధీ వెన్నంటి ఉన్నారు. రాజకీయ వర్గాలకు ఆర్వీగా చిరపరిచితుడైన వెంకట్రామన్ గొప్ప రాజనీతిజ్ఞ్డుడిగా గుర్తుండిపోతారు. జనవరి 27న కన్నుమూసిన ఆర్వీ భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. అస్వస్థతతో జనవరి 12న ఢిలీలోని సైనిక అసుపత్రిలో చేరిన వెంకట్రామన్ శరీరంలో కీలక అవయవాలు విఫలం కావడంతో వైద్యులు కృత్రిమ శ్వాస సహా అనేక వ్యవస్థలను అమర్చారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గతంలోనే చనిపోయారు.

ఇంకా

జీవితం :న్యాయవాదిగా మొదలైన ప్రస్థానం...

రాజ్యాంగబద్ధుడు రామస్వామి వెంకట్రామన్

అంతర్వాణీకే ప్రాధాన్యం


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved