17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఒబామా - నేడే ప్రమాణ స్వీకారం

మంగళవారం అమెరికాలో పెద్ద పండగ. ఈనాడే ఆ దేశంలో కొత్త శకం ప్రారంభంకానుంది. మొట్ట మొదటిసారిగా ఒక నల్లజాతికి చెందిన వ్యక్తి దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనవరి 20వ తారీకున అమెరికా తూర్పు భాగాన సరిగా మధ్యాహ్న వేళ బరక్ ఒబామా అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 లక్షలమంది పాలుపంచుకోనున్నారు. రాజధాని వాషింగ్టన్ నగరం ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రం తిలకించడానికి తరలివచ్చిన జనసందోహంతో కళకళలాడుతోంది.

ఒక తరం ముందు అమెరికాలో ఎవరినైనా ఒక నల్లజాతి వ్యక్తి అధ్యక్షపదవిని అధిరోహించగలడా అని అడిగితే తడుముకోకుండా సాధ్యంకాదనే సమాధానం వచ్చేది. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య(oldest democracy in the world) దేశంగా పేరుపొందిన అమెరికాలో జాతి వివిక్ష బ్రతికే వుందనటానికి ఆ పరిస్థితే నిదర్శనం. కాని ఆ స్థితిలో నేడు మార్పు కనబడుతోంది. మార్పే నినాదంగా ఎన్నికల బరిలో నిలచి తెలుపు నలుపన్న బేధంలేకుండా చక్కటి మెజారిటీతో బరాక్ ఒబామా గెలుపే దీనికి తొలి సోపానం.

బుష్ ప్రభుత్వ విధానాలతో విసిగి, ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టడుతున్న సామాన్య అమెరికన్ ఒబామా మార్పు మంత్రానికి ముగ్ధుడైయ్యాడు. అమెరికా ప్రస్థుత పరిస్థితిని చక్కదిద్ది తమ జీవితాలలో ఆనందం నిప్పుతాడని కోటి ఆశలతో ఒబామకు తమ ఓటుతో పట్టంకట్టారు. ఈ రోజు లాంఛనంగా "పట్టాభిషేకం" చేయనున్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved