17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

పాక్‌లో నూతన ప్రస్థానం

పాకిస్థాన్ కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్సు పార్టీ (పీపీపీ) అధినేత అసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారంతో ఆ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయం ఆరంభమైం ది. ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వానికి... మళ్ళీ నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి... ఇదీ ఆవిర్భావం నుంచి పాకిస్థాన్ ఎదుర్కొంటున్న విచిత్ర పరిస్థితి. ఈసారైనా ఆ పరిస్థితి మారుతుందా? ప్రజాస్వామ్య ప్రస్థానం సాఫీగా సాగుతుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం ఆశించడం అత్యాశే కావచ్చు. ఇప్పటిదాకా పాక్ చరిత్రను పరిశీలించినప్పుడు ఇంతకు మించి చెప్పడం సాహసం అవుతుంది.

అధ్యక్షుడిగా సెప్టెంబరు 9న జర్దారీ చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హమీద్ డోగర్ ప్రమాణస్వీకారం చేయించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే జర్దారీ చేసిన వ్యాఖ్యలు భేషుగ్గా ఉన్నాయి. అయితే ఆచరణలో ఎలా ఉంటాయన్నదే అసలైన ప్రశ్న. అంతర్గతంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని, అందరినీ విశ్ళాసంలోకి తీసుకుంటామని, కీలకమైన కాశ్మీర్ సమస్యపై నెలాఖరు లోగా శుభవార్త వింటారని జర్దారీ చేసిన వ్యాఖ్యలు వీనుల విందుగా ఉన్నాయి. ప్రత్యేక ఆహ్వానితుడు, ఆప్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సమక్షంలో భార్య బెనజీర్ భుట్టో, ప్రజాస్ళామ్యం కోసం పోరాడి అసువులు బాసిన వారి పేరిట ప్రమాణ స్ళీకారం చేసిన జర్దారీ తనదైన శైలిలో ఆరంభంలో అందరినీ ఆకట్టుకున్నారు. కారణం ఏదైనప్పటికి ఇంతలోనే ఒక అపశృతి దొర్లింది. నియంత ముషారఫ్‌ను గద్దె దించడంలో అండగా నిలిచిన నేస్తం నవాజ్ షరీఫ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం పెద్దలోటు. అయితే ముషారఫును జర్దారీ అసలు ఆహ్వానించారా లేదా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం లేదు. జర్దారీ ప్రమాణ స్వీకారం తరవాత లండ న్ వెళుతూ నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయన అసంతృప్తి స్పష్టమవుతుంది. ముషారఫ్ హయాంలో తొలగించిన న్యాయమూర్తులు అందరినీ తిరిగి తీసుకోవాలని, అధ్యక్షుడి కన్నా ప్రజాప్రభుత్వానిదే పైచేయిగా ఉండే రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పట్ల జర్దారీ స్పష్టమైన హామీ ఇవ్వనందునే ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదన్న అభిప్రాయం పాక్ రాజకీయ వర్గాల్లో ఉంది.

ఇంకా

జార్దారీ - ఘనవిజయం

మిస్టర్ టెన్ పర్సెంట్

ఇఫ్తికార్ నియామకంలో ఇబ్బందులేమిటి?


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved