17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీలంక సమస్య - భారత్ పరిస్థితి

By జి, శివ కుమార్

మైనారిటీ తమిళులపై 1983లో సింహళీయుల దాడులతో మొదలైన సమస్య రావణకాష్టంలా కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈకి 1990 వరకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యంక్షంగా,పరోక్షంగా సాయం చేయడం కాదనలేని సత్యం. లంక సమస్యపై 80వ దశకం ద్వితీయార్థంలో చొరవ చూపిన నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. శ్రీలంక అధికార పర్యటన సందర్భంగా కొలొంబోలో గౌరవవందనం స్వీకరిస్తున్న రాజీవ్‌పై హత్యాయత్నం జరిగింది. రాజీవ్ ప్రోద్బలంతో ఎల్టీటీఈ అణచివేతకు లంక వెళ్లిన భారత శాంతి పరిరక్షక దళం భంగపాటుకు గురైంది. టైగర్ల చేతిలో అమాయక సైనికులు బలయ్యారు. తాము ఎవరికోసం ఇక్కడ త్యాగాలు చేయాలో, పోరాడాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో 1989లో అధికారంలోకి వచ్చిన వీపీసింగ్ ప్రభుత్వం శాంతి పరిరక్షక దళాన్ని వెనక్కు రప్పించింది. తమపై పోరాటానికి సైన్యాన్ని పంపిన రాజీవ్‌పై తర్వాత టైగర్లు ప్రతీకారం తీర్చుకున్నారు. 1991 మేలో తమిళ టైగర్లు తమిళనాడులోని శ్రీపెరంబూరులో ఆయనను హతమార్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన హత్యకు గురయ్యారు. అప్పటినుంచి లంక విషయంలో, ముఖ్యంగా టైగర్ల విషయంలో బారత్, తమిళనాడు ప్రభుత్వాల వైఖరిలో మార్పువచ్చింది.

...అడకత్తెరలో పోకచెక్క

శ్రీలంకలో పరిస్థితిపై బారత్ ఆందోళన సహజమే. లంక సమస్యను పూర్తిగా ఆదేశ సమస్యగా పరిగణించలేం. అక్కడి తమిళులను వారి మానాన వారిని వదిలేయలేం. అదే సమయంలో ఒక సార్వభౌమత్వ దేశంగా శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేం. అలాగని ప్రేక్షకపాత్రా వహించలేం. లంకను సమర్థించలేం. అలాగని వ్యతిరేకించ లేం. భారత్ పరస్థితి "కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం" అన్న చందాన ఉంటుంది. మధ్యేమార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. లంకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడల్లా భారత్‌లో, ముఖ్యంగా తమిళనాడులో దాని ప్రభావం కనిపిస్తుంటుంది.

ఇంకా

నార్వే ప్రయత్నాలు నిష్ఫలం

శ్రీలంక సమస్య పరిష్కారానికై ఇలా...

తమిళ రాజకీయాలు - కరుణానిధికి కష్టకాలం


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved