17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీలంక తమిళుల సమస్య పరిష్కారానికై ఇలా...

By జి, శివ కుమార్

శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తమిళ ఈలం ఏర్పాటు చేయాలని టైగర్లు కోరుతుండగా ప్రస్తుత కేంద్రీకృత అధికార వ్యవస్థ పరిధిలోనే పాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లని ఏర్పాటుకోసం లంక ప్రయత్నిస్తోంది. దేశ జనాభాలో 20 శాతం వరకు ఉన్న తమిళుల మనోభావాలను విస్మరించి ముందడుగు వేయడం సర్కారుకు అసాధ్యం. ఉభయపక్షాలు సంయమనం పాటించి చర్చలకు రావడమే సమస్యకు ఏకైక పరిష్కారం. ప్రభుత్వం పెద్దమనసుతో వ్యవహరించాలి. సైనికచర్యలో తాత్కాలికంగా విజయం సాధించినప్పటికీ, సమస్య పరిష్కారానికి ఇదొక్కటే దోహదపడదని లంక నాయకత్వం గుర్తించాలి. పట్టువిడుపుల ధోరణితో ముందుకు సాగాలి. వాస్తవిక దృక్పధంతో వ్యవహరించి ఇరు పక్షాలు ఒక్కో మెట్టు దిగిరావాలి. అప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయి.

టైగర్లు తీరు ఎలా ఉన్నప్పటికి జాతులతో నిమిత్తం లేకుండా అమాయక తమిళ పౌరుల రక్షణ అక్కడి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. తమ పోరాటం టైగర్ల మీదే తప్ప తమిళులపై కాదందటున్నరాజపక్సె వ్యాఖ్యలు ఆచరణలో రుజువు కావాలి. శ్రీలంక తమిళులు, వలస తమిళులు అన్న విచక్షణను ప్రభుత్వం విడనాడాలి.

సమస్య పరిష్కారానికి దేశీయంగా చర్యలతోపాటు అంతర్జాతీయ సమాజం సహకారం తీసుకోవాలి. నార్వేతో పాటు ఇందులో భారత్‌నూ భాగస్వామ్యం చేయాలి. భారత్ పాత్రను జోక్యంగా పరిగణించరాదు.లంకలోని తమ సంతతి తమిళుల పట్ల భారత్ తన బాధ్యతను విస్మరించజాలదు. భారత్‌ను పెద్దన్న దృష్టిలో కాకుండా సహజ మిత్రదేశంగా పరిగణించాలి.

ఇంకా

శ్రీలంక సమస్య - భారత్ పరిస్థితి

నార్వే ప్రయత్నాలు నిష్ఫలం

తమిళ రాజకీయాలు - కరుణానిధికి కష్టకాలం


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved