19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

"నెనింతే":ఫర్ సినిమా పీపుల్ - బై సినిమా పీపుల్

సుప్రసిద్ధ హీరో రవితేజ కథానాయకుడిగా, ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం "నేనింతే" .

సినిమా గ్లామర్ కాని, పవర్ కాని ఎంత గొప్పదో ఇందులోని కష్టాలు, కన్నీళ్ళు విచారగాధలు కూడా అంతగా ఉంటాయి. ఈ రంగంలో స్వయంకృషితో పైకొచ్చిన ప్రతీ వ్యక్తి వెనుక ఒక అద్భుతగాధ కాని, ఒక బాధాకర పరిస్థితిగాని ఉండి తీరుతుంది. అద్భుతమైన వెండితెర వెనుక దయనీయమైన గాధను చెప్పటానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చుట్టూ అల్లిన కథ ఈ చిత్రం. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ స్థాయికి ఎదుగే పరిణామక్రమంలో ఆ వ్యక్తి ఎదుర్కునే చిత్ర విచిత్ర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. హైదరబాద్‌లో సినిమా వారు స్థిరపడిన కృష్ణానగర్‌ను ఈ చిత్రానికి బ్యాక్‌డ్రాప్‌గా తీసుకున్నారు. మంచైనా చెడైనా దర్శకుడు తాననుకున్నది నిష్కర్షగా చెప్పాడు. సినిమా రంగంలో వెలుగునీడలను దాపరికం లేకుండా తెరకెక్కించాలన్న ప్రయత్నంగా వచ్చిన ఈ చిత్రంలో తాను పూర్తిగా చెప్పలేకపోయానని పూరీ పత్రికలతో అన్నడం విశేషం.

కథ:

హీరో తల్లి కొడుకు డైరెక్టర్ కావాలని తపన పడుతుంది. తల్లి కోరిక నెరవేర్చడానికి ఒకపక్క సబ్జెక్ట్ రాసుకుంటూ, నిర్మాతలను కలుస్తూనే, మరో పక్క తానంటే ఇష్టపడే గ్రూప్ డ్యాన్సర్‌ను హీరోయిన్ చేయడానికి కృషి చేస్తుంటాడు అసిస్టెంట్ డైరెక్టరైన హీరో. ఆ డ్యాన్సర్‌ను వీరి వీధిలోని విలన్ కూడా కోరుకోవడంతో హిరో విలన్‌లమధ్య క్లాష్ ప్రారంభమౌతుంది. సినిమాల్లో హీరో పాత్ర మన అసిస్టెంట్ డైరెక్టర్(రవి) చెప్పిన కథ విని అతనికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. నిర్మాత ముందు చిత్రం ఫ్లాప్ అవడంతో రవికి వచ్చిన సినిమా ఆగిపోతుంది. కాని అనికోకుండా నిర్మాతకు ఒక ఫైనాన్షియర్ దొరకడంతో షూటింగ్ మొదలవుతుంది. కానీ ఆ ఫైనాన్షియర్ రవితో తలపడ్డ విలన్ కావడంతో తిరిగి క్లాష్ ప్రారంభమవుతుంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved