22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సావిత్రి జీవితం - చరమాంకం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించే సమయంలోనే.హీరో జెమినీ గణేష్ ప్రేమ మత్తులో పడి ఆమె ఆయనను వివాహం చేసుకున్నారు. ఎంతో ఇష్టపడి, ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె వైవాహిక జీవితం మాత్రం ముళ్ళబాటలోనే నడిచింది. వివాహ సంబంధాలు ఇరువురి మధ్య తెగిపోయాయి. నమ్మిన వ్యక్తులే మోసపుచ్చి ఆమెను నట్టేట ముంచారు . ఎంతో సంపన్నురాలైన ఆమె వ్యాపారాలపేరిట, దానాలపేరిట, మోసాలపాలై, ఇలా సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. జీవితంలో తట్టుకోలేని సమస్యలు, మెంటల్ టెన్షన్ లు ఎక్కువయ్యాయి. చివరికి వ్యసనాలకు బానిస అయ్యారు. తాగుడు, నిద్రమాత్రలు, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడ్డారు. అనేక మార్లు ఆస్పత్రిలో చేరి చికిత్సనూ పొందారు. డాక్టర్లు మత్తు పదార్ధాలు వలదని వారించినా ఫలితం లేకపోయేది.

చివరిసారిగా ఆమె బెంగుళూరు సమీపంలో తెలుగు చిత్రానికి షూటింగ్‌లో పాల్గొనటానికి వెళ్లి (మత్తులో) పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్ధురాలు కూడా అయిన ఆమె అంతిమ దశలోకి (టర్మినల్ కోమా) చేరుకున్నారు. ఆమె మరణించడానికి ముందు సినీ పరిశ్రమ నుంచి (సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛేంబర్ గోల్డెన్ కమిటీ) ఆమెకి 10,000 రూపాయలు విరాళం అంధింది. అవి ఆమె వైద్యానికి ఎంత మాత్రం సహాయ పడ్డాయో తెలియదు. ఇద్దరు పిల్లలు, నర్సు సంరక్షణలో, అద్దె భవనంలో అతి భయంకరమైన పరిస్ధితిలో.... దాదాపు 18 నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం డిసెంబరు 26, 1981, శనివారు రాత్రి 11గం.లకు తుది శ్వాస విడిచారు.

సావిత్రి చరమాకంలోనిదిగా చెప్పబడుతున్న చిత్రం

ఇంకా

మహానటి సావిత్రి ఒక నిజమైన లెజండ్

సినీ సామ్రాజ్ఞి....సావిత్రి

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved